Allu Arjun: బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? మల్టీ స్టారర్‌ చిత్రంతో ముంబయిలో పాగా వేయనున్నాడా..

Allu Arjun: పాన్‌ ఇండియా చిత్రాల కారణంగా.. భాషతో సంబంధం లేకుండా సినిమాలు దేశమంతటా హల్చల్‌ చేస్తున్నాయి. ఇందులో భాంగానే దర్శక, నిర్మాతలు సైతం...

Allu Arjun: బన్నీ బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందా..? మల్టీ స్టారర్‌ చిత్రంతో ముంబయిలో పాగా వేయనున్నాడా..
Allu Arjun

Updated on: Nov 27, 2021 | 6:34 PM

Allu Arjun: పాన్‌ ఇండియా చిత్రాల కారణంగా.. భాషతో సంబంధం లేకుండా సినిమాలు దేశమంతటా హల్చల్‌ చేస్తున్నాయి. ఇందులో భాంగానే దర్శక, నిర్మాతలు సైతం కథలను, హీరోల పాత్రలను సైతం అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు బాలీవుడ్‌ బాటపట్టారు. ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా బాలీవుడ్‌ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. నిజానికి బన్నీకి ఇప్పటికే కేరళలో విపరీమైన ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. ఇక బన్నీ బాలీవుడ్‌ చిత్రానికి సంబంధించి ఇది వరకు చాలా సార్లు వార్తలు వచ్చినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఐకాన్‌ స్టార్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించి వార్తలు వస్తున్నాయి.
అయితే దీనికి ఒక కారణం ఉందండోయ్‌.. తెలుగులో సంచనల విజయం సాధించిన ‘జెర్సీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరించారు. దీంతో అల్లు ఫ్యామిలీ ఇలా నిర్మాణ రంగం ద్వారా ఇప్పటికే బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిందన్నమాట. ఇప్పుడు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అర్జున్‌ హిందీ సినిమాను ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోందని సమాచారం. ఇందులో బన్నీతో పాటు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటించనున్నట్లు సమాచారం.

షాహిద్‌ ఇప్పటికే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నటించడంతో ఈ సినిమాకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్‌ నిజంగానే సెట్‌ అవుతుందా.. లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Omicron Variant: కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ అలెర్ట్.. రేపు అత్యవసర సమావేశం..

IIT Recruitment: ఖరగ్‌పూర్ ఐఐటీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

డివిలియర్స్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్‌ !! వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us