Harbhajan Movie: లైఫ్‌లో మజా కోసం హర్భజన్‌ ఏం చేస్తాడో తెలుసా..? నవ్వులు పూయిస్తోన్న బజ్జీ కొత్త సినిమా సాంగ్‌..

Harbhajan Movie: తన అద్భుత స్పిన్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టించిన టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ ఇప్పుడు నటుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. బంతిని మెలికలు తిరిగించిన..

Harbhajan Movie: లైఫ్‌లో మజా కోసం హర్భజన్‌ ఏం చేస్తాడో తెలుసా..? నవ్వులు పూయిస్తోన్న బజ్జీ కొత్త సినిమా సాంగ్‌..
Harbjan Friend Ship Movie

Updated on: Mar 29, 2021 | 5:32 PM

Harbhajan Movie: తన అద్భుత స్పిన్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టించిన టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ ఇప్పుడు నటుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. బంతిని మెలికలు తిరిగించిన బజ్జీ ఇప్పుడు థియేటర్లలో నవ్వులు పూయించడానికి సిద్ధమవుతున్నాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత హర్భజన్‌ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.
ఈ క్రమంలోనే హర్భజన్‌ ప్రధాన పాత్రలో ‘ఫ్రెండ్‌షిప్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తమిళ బిగ్‌ బాస్‌ ఫేమ్‌ లోస్లియా మరియనేసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్‌ పాల్‌ రాజ్‌, శ్యామ్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హిందీ, కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాలో సీనియర్‌ హీరో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటిస్తుండడం మరో విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ‘లైఫ్‌లో మజా కోసం కాలేజీకి వెళ్తాం. మాస్టారు క్లాసులో తిని తొంగుంటాం’ అని సాగే ఈ పాట నవ్వులు పూయిస్తోంది. ఇక ఇంతకు ముందు చిత్ర యూనిట్‌ విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాలో బజ్జీ ఓ స్టూడెంట్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. తమకు జరిగిన ఓ అన్యాయంపై స్టూడెంట్స్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేదే ఈ సినిమా కథాంశం. మరి తన బౌలింగ్‌తో అదరగొట్టిన హర్భజన్‌ సినిమాల ద్వారా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

పాట విడుదల చేస్తూ నిర్మాత బీఏ రాజు చేసిన ట్వీట్‌..

‘ఫ్రెండ్‌షిప్‌’ సినిమా టీజర్‌..

Also Read: Singer Sunitha: అభిమానులకు క్షమాపణలు చెప్పిన అందాల సింగర్.. అసలు విషయం ఇదే..

Faria Abdullah: ఈ లేడీ జాతిరత్నానికి అలాంటి పాత్ర చేయాలని ఉందట.. షాక్ ఇచ్చిన ఫరియా

Prabhas New Car: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త కారులో చక్కర్లు కొడుతోన్న ప్రభాస్.. కారు ధర ఎంతో తెలిస్తే..