Priyanka Chopra: సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వ్యవహరించే శైలి కొన్ని సందర్భాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్న సందర్భాలను చూస్తున్నాం. ఏ ఉద్దేశంతో వారు పోస్టులు పెడతారో కానీ అది కాస్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. గత కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకునే ముందు సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కినేని పేరు మార్చిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఈ జంట విడిపోతున్నట్లు చర్చ మొదలైంది. తర్వాత అందరూ అనుకున్నట్లే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటన చేసి అందరినీ షాకకి గురి చేసింది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో జరిగిన ఓ పరిణామం సెన్సేషన్‌గా మారింది.
ఆ జంట మరెవరో కాదు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ జోనస్. ప్రాంతాలు వేరైనా, భాషలు, ఆచారవ్యవహారాలు వేరైనా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు ఈ జంట. 2018లో పెద్దలను ఒప్పించి ఒక్కటైన ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. వీరిద్దరి సంబంధించిన ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో ఈ జంట కలిసి చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది.
అయితే తాజాగా ప్రియాంక చేసిన ఓ పోస్ట్ పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ ప్రోఫైల్ పేరు నుంచి భర్త నిక్ జోనస్ పేరును తొలిగించింది. దీంతో ఇది చూసిన కొందరు షాక్‌కి గురవుతున్నారు. ఇంతకీ ఈ జంట మధ్య ఏమైంది అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయమై ప్రియాంక తల్లి స్పందిస్తూ.. ‘ఇవన్నీ వట్టి పుకార్లేనని తేల్చి చెప్పారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేరును మార్చుకున్నప్పటికీ వారి మధ్య ఎలాంటి మనస్పర్థాలు లేవని ఆమె తెలిపారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read: Two Wheelers: ఈ ఏడాది బైక్‌ల విక్రయాలకు పెద్ద ఎదురుదెబ్బ.. కారణాలు ఇలా ఉన్నాయి..?
Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంటి గుడిలో ఉంచే దేవుని విగ్రహాల గురించి కొన్ని నియమాలున్నాయి…
PPF: ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఇబ్బందులు కొని తెచ్చుకోకండి!