Shilpa Shetty: ప్లీజ్.. మా కుటుంబాన్ని ఇలా వదిలేయండి.. మీడియాకు శిల్పా శెట్టి వినతి

తన భర్త రాజ్ కుంద్రా కేసులో తమ కుటుంబం పట్ల ట్రోలింగ్ చేస్తూ.. పూర్తి సమాచారం తెలుసుకోకుండా వదంతులను ప్రచారం చేస్తూ.. ఒకరకంగా ఇబ్బంది పెడుతున్నారని, దయ చేసి వీటికి స్వస్తి చెప్పాలని రాజ్ కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టి కోరింది...

Shilpa Shetty: ప్లీజ్.. మా కుటుంబాన్ని ఇలా వదిలేయండి.. మీడియాకు శిల్పా శెట్టి వినతి
Don't Deserve Media Trial Says Shilpa Shetty

Edited By:

Updated on: Aug 02, 2021 | 2:40 PM

తన భర్త రాజ్ కుంద్రా కేసులో తమ కుటుంబం పట్ల ట్రోలింగ్ చేస్తూ.. పూర్తి సమాచారం తెలుసుకోకుండా వదంతులను ప్రచారం చేస్తూ.. ఒకరకంగా ఇబ్బంది పెడుతున్నారని, దయ చేసి వీటికి స్వస్తి చెప్పాలని రాజ్ కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టి కోరింది. తమకు మీడియా ‘ట్రయల్ ‘అవసరం లేదని, తమపై వస్తున్న ఆరోపణలకు తాను స్పందించబోనని ఆమె తాజా స్టేట్ మెంట్ లో పేర్కొంది. అనుచితమైన వదంతులు, అభియోగాలు తగవు. గత కొన్ని రోజులుగా ప్రతీ విషయం లోనూ మేము సవాళ్ళను ఎదుర్కొంటున్నాం.. నన్ను, నా కుటుంబాన్ని వేలెత్తి చూపుతున్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు.. కేసు కోర్టు పరిశీలనలో ఉంది. అందువల్ల నేను ఎలాంటి కామెంట్లు చేయను అని ఆమె వివరించింది. ఇకపై కూడా ఇదే ధోరణిని అనుసరిస్తానని, తమపట్ల తప్పుడు వ్యాఖ్యలు చేయరాదని ఆమె అభ్యర్థించింది. ‘నెవర్ కంప్లెయిన్, నెవర్ ఎక్స్ ప్లైన్’ అన్న పద్దతిని తాను పాటిస్తానని ఆమె తెలిపింది.

ముంబై పోలీసుల పట్ల, భారత జుడీషియరీ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని శిల్పా శెట్టి వెల్లడించింది. ఒక కుటుంబంగా తాము అందుబాటులో ఉన్న అన్ని లీగల్ మార్గాలను పరిశీలిస్తున్నామని ఆమె పేర్కొంది.గత 29 ఏళ్లుగా నేను హార్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్ ని… నా మీద అభిమానులకు విశ్వాసం ఉంది.. ఎవరినీ కించపరచాలన్నది మా ఉద్దేశం కాదు/.. నాకు, నా కుటుంబానికి ప్రైవసీకి సంబంధించి గల హక్కును గౌరవించండి అని ఆమె కోరింది.

మరిన్ని ఇక్కడ చూడండి : ఖాకీ కావరం..బూటుకాలితో తన్నుతూ ఇలా..!మాస్క్‌ పెట్టుకోలేదని..:Police attack Video.

 పోర్నోగ్రఫీ కేసులో తిరగబడిన శిల్పా శెట్టి..!మీడియాపై ఫైర్ అయినా హీరోయిన్..:Pornography case Video.

 చిరుతలతో దోస్తాన్ ఏంద్రా సామీ..!మూడు చిరుతలను హాగ్ చేసుకొని పడుకున్న వ్యక్తి..(వీడియో):Man with Cheeta video.

 పాతిపెట్టిన శవం.. ఎలా బయటకు వచ్చింది..?నడిరోడ్డుపై శవ పేటిక..:Buried corpse video.