Rohit Shetty: షూటింగ్‌లో గాయపడిన స్టార్ డైరెక్టర్.. సర్జరీ చేసిన డాక్టర్లు

ప్రస్తుతం రోహిత్ శెట్టి హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొన్నారు. ఇండియన్ పోలీస్ ఫోర్స్అనే పోలీస్ వెబ్ సిరీస్ ల్లో భాగంగా హైదరాబద్ లో రామోజీఫిలిం సిటీలో షూటింగ్

Rohit Shetty: షూటింగ్‌లో గాయపడిన స్టార్ డైరెక్టర్.. సర్జరీ చేసిన డాక్టర్లు
Rohit Shetty

Updated on: Jan 07, 2023 | 2:23 PM

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి హాస్పటల్ పాలయ్యారు. రోహిత్ శెట్టి హైదరాబాద్ లోని కామినేని హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు రోహిత్ శెట్టి. ఇండియన్ పోలీస్ ఫోర్స్అనే పోలీస్ వెబ్ సిరీస్ ల్లో భాగంగా హైదరాబద్ లో రామోజీఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఇన్నాళ్లు డైరెక్టర్ గా రాణించిన రోహిత్ ఇప్పుడు హీరోగా మారి వెబ్ సిరీస్ చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ సమయంలో రోహిత్ శెట్టి గాయపడ్డారని తెలుస్తోంది.

కార్ చేజ్ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో అతని చేతికి గాయమైంది. ప్రొడక్షన్ టీం వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఎల్బీ నగర్ లోని కామినేని ఆసుపత్రికి  తరలించారు. వైద్యులు చిన్నపాటి శస్త్ర చికిత్స చేసి వెంటనే డిశ్చార్జి చేశారు.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ లో రోహిత్ శెట్టి స్టార్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్ గా రణవీర్ సింగ్ తో సర్కస్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us