Urvashi Rautela: రిషబ్ పంత్‏కు చేతులు జోడించి క్షమాపణ చెప్పిన హీరోయిన్.. ఊర్వశి రౌతేలా చేసిన పనికి క్రికెటర్ రియాక్షన్ ఏంటంటే..

|

Sep 14, 2022 | 8:08 AM

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రిషబ్ పంత్‏కు ఊర్వశి క్షమాపణలు చెప్పింది. ఐయామ్ సారీ అంటూ చేతులు జోడించింది హీరోయిన్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

Urvashi Rautela: రిషబ్ పంత్‏కు చేతులు జోడించి క్షమాపణ చెప్పిన హీరోయిన్.. ఊర్వశి రౌతేలా చేసిన పనికి క్రికెటర్ రియాక్షన్ ఏంటంటే..
Urvashi
Follow us on

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela).. క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య నెలకొన్న వివాదం గురించి అందరికి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు పరోక్షంగా దూషించుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ.. రిషభ్ పంత్‏ను ఉద్దేశించి ఆర్పీ అనే వ్యక్తి తన కోసం ఎయిర్ పోర్టులో గంటల తరబడి ఎదురుచూశాడంటూ ఆమె చెప్పడంతో అసలు వివాదం మొదలైంది. దీంతో రిషబ్ పంత్ స్పందిస్తూ..కొందరు ఫేమస్ కావడం కోసం ఇతరులపై అబద్దాలు చెప్పేస్తుంటారు అంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా అక్కా.. నన్ను వదిలేయ్ అంటూ కామెంట్ చేశాడు రిషబ్. అయితే ఊర్వశి సైతం ఏమాత్రం తగ్గకుండా.. నువ్వో పిల్లా బచ్చావి తమ్ముడు.. బ్యాట్, బంతితో నువ్వు ఆటకే పరిమితమవ్వు అంటూ రివర్స్ అటాక్ చేసింది ఊర్వశి. అయితే తాజాగా వీరిద్ధరి మధ్య నెలకొన్న వివాదానికి తెర పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రిషబ్ పంత్‏కు ఊర్వశి క్షమాపణలు చెప్పింది. ఐయామ్ సారీ అంటూ చేతులు జోడించింది హీరోయిన్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

అందులో బాలీవుడ్ రిపోర్టర్ ఊర్వశిని పలకరిస్తూ.. ఆర్పీకి మీరు మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా ? అని అడగ్గా.. ఊర్వశి మాట్లాడుతూ.. నేను చెప్పాలనుకుంటున్నాను.. కానీ ఏం చెప్పాలనేది నాకు తెలియదు. కేవలం నన్ను క్షమించు అంటూ చేతులు జోడిస్తూ వెళ్లిపోయింది. ఈవీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమెను పంత్ లైట్ తీసుకున్నాడు. తాను ఇప్పుడు క్రికెట్ పై మాత్రమే దృష్టి పెట్టాడు. అందుకే ఆమె దిగివచ్చి క్షమాపణలు కోరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఊర్వశి క్షమాపణపై రిషబ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్, ఊర్వశి రౌతేలా రిలేషన్ షిప్‏లో ఉన్నారని.. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారనే వార్తలు వినిపించారు. రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలో భారత నంబర్ వన్ వికెట్ కీపర్.. బ్యాట్స్ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.