సీనియర్ హీరోయిన్ టబు (tabu) ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇందులో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా చిత్రీకరణంలో పెను ప్రమాదం చోటు చేసుకుందని.. హీరోయిన్ టబు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఆమె కంటి గాయమై రక్తస్రావం జరిగిందట.
వివరాల్లోకెలితే.. భోలా షూటింగ్లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశం కోసం టబు దట్టమైన అడవిలో ట్రక్కు నడుపుతుంది. ఆమెను బైక్ పై కొందరు విలన్స్ వెంబడిస్తుంటారు. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన బైక్ ట్రక్కును ఢీకొట్టడంతో ట్రక్కు అద్దాలు పగిలి టబుకు గాయాలయ్యాయని తెలుస్తోంది. కంటికి.. నుదిటిపై.. కనుబొమ్మలకు గాయమై తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా సమాచారం. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారట. టబు కోలుకునే వరుక భోలా సినిమా షూటింగ్ నిలిచిపోనుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం 2023 మార్చి 30 విడుదల కానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.