ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టైమ్ నడుస్తోందనే చెప్పుకోవాలి. కరోనా కాలంలోనూ ఈ అమ్ముడుకి కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న ప్రియాంక తాజాగా మరో భారీ ఆఫర్ అందుకుంది. ఇటాలియన్ జ్యువెలరీ కంపెనీ బుల్గారి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రా నియమించబడింది. దీంతో ప్రియాంక జోనాస్ బుల్గారి కుటుంబంలో చేరింది. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బుల్గారి సంస్థ ఇన్ స్టాలో సినీ నటి.. నిర్మాత ప్రియాంక చోప్రా.. బుల్గారి నగలలో గ్లోబల్ అంబాసిడర్ గా చేరారు అంటూ ట్వీట్ చేసింది.
తాజాగా బుల్గారి సంస్థ షేర్ చేసిన ఫోటోలలో ప్రియాంక చోప్రా వైట్ డ్రెస్ లో క్లాసీ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. అటు బుల్గారి బ్రాండ్‌తో భాగస్వామ్యం కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని ప్రియాంక తెలిపారు. గ్లోబల్ అంబాసిడర్ గా బుల్గారి కుటుంబంలో చేరడం చాలా గర్వంగా ఉేంది. @Jc.babin బృందం నాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. ఈ ఐకానిక్ బ్రాండ్ నన్ను ఆకర్షించిన అంశాలు చాలా ఉన్నాయి. కానీ చాలా సేంద్రీయంగా కనెక్ట్ చేసినవి. భారతదేశం పట్ల మనకున్న పరస్పర ప్రేమ, బుల్గారి క్రియేషన్స్‌లో ఉపయోగించిన అరుదైన రత్నాల నుంచి పరిమళాలు, అలాగే వాటి సువాసనగల పువ్వుల వరకు ఇలా ప్రతిదీ ఉపయోగిస్తుంటారు. ఈ అధ్బుతమైన భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాను.
ట్వీట్..
Also Read: Sharwanand: శర్వానంద్ సింప్లిసిటీకి చిత్రయూనిట్ ఫిదా.. షూటింగ్ సెట్లో టాలెంటెడ్ హీరో…