Rashmika Mandanna: అట్లుంటది మరి రష్మికతో.. ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్‌ తెలిస్తే అదిరిపడాల్సిందే..

|

Mar 17, 2022 | 5:47 PM

Rashmika Mandanna: రష్మిక.. ఇప్పుడు ఈ పేరు టాక్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఇండస్ట్రీగా మారింది. పుష్ప (Pushpa) సినిమాలో శ్రీవల్లి పాత్రతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ అందాల తార, నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. డీగ్లామర్‌ పాత్రలో నటించినా తన నటనతో యావత్‌..

Rashmika Mandanna: అట్లుంటది మరి రష్మికతో.. ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్‌ తెలిస్తే అదిరిపడాల్సిందే..
Rashmika Mandanna
Follow us on

Rashmika Mandanna: రష్మిక.. ఇప్పుడు ఈ పేరు టాక్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఇండస్ట్రీగా మారింది. పుష్ప (Pushpa) సినిమాలో శ్రీవల్లి పాత్రతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ అందాల తార, నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. డీగ్లామర్‌ పాత్రలో నటించినా తన నటనతో యావత్‌ ఇండియన్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ (Bollywood) వరుస సినిమాల్లో నటిస్తూ జోష్‌ మీదుందీ చిన్నది. ఇప్పటికే పలు బాలీవుడ్‌ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రష్మిక.. తాజాగా ఓ ఐటెం సాంగ్‌లో నటించడానికి పచ్చ జెండా ఊపిందని తెలుస్తోంది.

అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగ దర్శకత్వంలో ‘యానిమల్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌బిర్‌ కపూర్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం రష్మికను అప్రోచ్‌ అయ్యారని సమాచారం. దీనికి రష్మిక కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే కేవలం ఐదు నిమిషాలు ఉండే ఈ స్పెషల్‌ సాంగ్‌ కోసం రష్మిక ఏకంగా రూ. 2 కోట్లు రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు చివరికి రూ. కోటిన్నర ఇవ్వడానికి సిద్ధమని చెప్పారని తెలుస్తోంది.

ఈ పాటకు గాను రష్మిక కేవలం వారం రోజుల కాల్‌షిట్స్‌ ఇవ్వనుంది. అంటే కేవలం ఏడు రోజుల్లో రూ. కోటిన్నర సంపాదిస్తుందన్నమాట. ఇదిలా ఉంటే పుష్పలో సమంత చేసిన ‘ఊ అంటావా’ పాట ఏ రేంజ్‌లో హిట్‌ అయ్యిందో ప్రత్యేంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటకు సమంత రూ. 2 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటతో సామ్‌ ఒక్కసారిగా నేషనల్‌ ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రష్మిక కూడా ఇదే ప్లాన్‌లో ఉందా అన్న చర్చ నడుస్తోంది.

Also Read: Balka Suman: బుల్డోజర్లు తెచ్చి తెలంగాణ ప్రజలను చంపుతారా?.. టీఆర్ఎస్ విప్ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

Krishna District: యాక్షన్‌లోకి దిగిన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్.. వారికి వాటర్, డ్రైనేజీ కనెక్షన్లు కట్

Viral Video: ఇన్‏స్టా రీల్ చేద్దామనుకున్నాడు.. కానీ.. పెంపుడు కుక్క దెబ్బకు ఫ్యూజులౌట్..