Ram Pothineni: రామ్ పోతినేని సినిమాలో విలన్‌గా టాలీవుడ్ హీరోయిన్ భర్త.. క్రేజీ ప్రాజెక్ట్‌లో ఊహించని ట్విస్ట్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు రామ్. అయితే ఇప్పుడు ఈ హీరో నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ పై మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ వైరలవుతుంది. ఈ కొత్త చిత్రంలో విలన్‌గా ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు నటించనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, టాలీవుడ్ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Ram Pothineni: రామ్ పోతినేని సినిమాలో విలన్‌గా టాలీవుడ్ హీరోయిన్ భర్త.. క్రేజీ ప్రాజెక్ట్‌లో ఊహించని ట్విస్ట్!
Ram Pothineni

Updated on: Sep 18, 2026 | 9:02 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఒక సరికొత్త థ్రిల్లర్ యాక్షన్ డ్రామా కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన ఏకధాటిగా, ఎలాంటి విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రామ్‌ను ఢీకొట్టే బలమైన విలన్ పాత్ర కోసం మేకర్స్ సుదీర్ఘంగా వేట సాగించారు. ఈ క్రేజీ విలన్ రోల్ కోసం చిత్ర యూనిట్ మొదట కోలీవుడ్ విలక్షణ నటుడు ఎస్. జె. సూర్యను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఆయన నటన ఈ పాత్రకు బాగా సెట్ అవుతుందని భావించినప్పటికీ, రెమ్యునరేషన్, ఇతర బేరసారాలు కుదరకపోవడంతో ఆ కాంబినేషన్ పట్టాలెక్కలేదు. దాంతో ఈ పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్ర కోసం ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు, నటి జెనీలియా భర్త అయిన రితేష్ దేశ్‌ముఖ్‌ను ఫైనల్ చేసినట్లు తెలిసింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..

రితేష్ దేశ్‌ముఖ్ బాలీవుడ్‌లో కామెడీ పాత్రలతో పాటు ‘ఏక్ విలన్’ వంటి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో తన అద్భుత నటనతో అలరించారు. ఇప్పుడు టాలీవుడ్‌లో రామ్‌కి పోటీగా విలన్‌గా నటించబోతుండటం సినిమాపై అంచనాలను పెంచేసింది. గతంలో రామ్ పోతినేని, జెనీలియా డిసౌజా కలిసి ‘రెడీ’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా టాలీవుడ్‌లో అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్, రామ్ సినిమాలో ప్రధాన విలన్‌గా నటిస్తుండటం విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి, రాబోయే డిసెంబర్ బరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రితేష్ దేశ్‌ముఖ్ ఎంట్రీకి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

రితేష్ దేశ్ ముఖ్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us