
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకీ ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు నుంచి అనసరవమైన గొడవలు, రచ్చ తప్పా అంత ఆసక్తికరంగా సాగుతున్న మాటే లేదు. ఇక కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధంతో హౌస్ హీటెక్కుతోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ మధ్య నామినేషన్లు, ఎలిమినేషన్ల భయం స్పష్టంగా కనిపించింది. పలువురు సభ్యులు తమ సీటును కాపాడుకునేందుకు హోరాహోరీగా పోరాడగా, ముఖ్యంగా రోహిత్ వ్యవహరించిన తీరు హౌస్‌లో సరికొత్త రచ్చకు తెరలేపింది. ఈ వారం ఎలిమినేషన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు బిగ్‌బాస్ సభ్యులకు ప్రత్యేక అవకాశాలు, టాస్క్‌లు ఇచ్చారు. ఇందులో ఆట పూర్తయ్యేసరికి అమన్, రాంప్రసాద్, ముకేశ్, షాలిని, అపూర్వ.. వరసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. దీంతో అమన్ టీంకి 100, రాంప్రసాద్ టీంకి 80, ముకేశ్ టీంకి 60, షాలిని టీంకి 40, అపూర్వ టీంకి 20 పాయింట్లు లభించాయి. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ ప్రక్రియలో సరైన వ్యూహాలు అమలు చేసి.. లీడర్ బోర్డ్‌లో 180 పాయింట్లతో మొదటి స్థానంలో అమన్-త్రిగుణ్ ఉండటంతో నామినేషన్ల నుంచి సేప్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఓటింగ్ , టాస్క్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా తమ పొజిషన్‌ను బలపరుచుకుని సేఫ్ అవ్వడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఎపిసోడ్‌లో ప్రధానంగా హైలైట్ అయింది రోహిత్ వ్యవహార శైలి. హౌస్‌లోని సభ్యుల మధ్య గ్రూపిజం, సమన్వయం లోపించడంతో రోహిత్ మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు రచ్చకు దారితీశాయి. తోటి కంటెస్టెంట్ల మధ్య ఉన్న సంబంధాలలో రోహిత్ “పుల్లపెట్టడం” వల్లే వివాదం పెద్దదైందని కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా త్రిగున్, షాలిని, అపూర్వ వంటి సభ్యుల మధ్య ఈ విషయమై తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.
ఒకవైపు ఆటలో భాగంగా రోహిత్, షాలినిల మధ్య సాన్నిహిత్యం, హగ్గులు కనిపించగా, మరోవైపు ముకేశ్, వర్షిణి జోడీల రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అంతలోనే టాస్క్‌లు, నామినేషన్ల చర్చ రాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ‘నా గేమ్ నేను ఆడుకుంటా, ఎవరి సపోర్ట్ అవసరం లేదు’ అంటూ కొందరు కంటెస్టెంట్లు గట్టిగానే స్పందించారు. మొత్తానికి బిగ్‌బాస్ 10వ సీజన్ 32వ రోజు ఎపిసోడ్ ఎమోషన్స్, వ్యూహాలు, గొడవల సమాహారంగా సాగింది. రోహిత్ పెట్టిన పుల్లతో రాబోయే రోజుల్లో హౌస్‌లోని సమీకరణాలు ఎలా మారతాయో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం పాయింట్ల పట్టిక బట్టి చూస్తే రోహిత్-షాలిని డేంజర్ జోన్‌లో ఉన్నారు.
ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..