Ranabaali Movie: చరిత్ర చెప్పని కథకు ప్రాణం పోశారు.. రణబాలి ట్రైలర్ పై నారా లోకేష్ ప్రశంసలు..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 16న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ మూవీపై అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమాపై హైప్ పెంచేసింది.

Ranabaali Movie: చరిత్ర చెప్పని కథకు ప్రాణం పోశారు.. రణబాలి ట్రైలర్ పై నారా లోకేష్ ప్రశంసలు..
Nara Lokesh

Updated on: Oct 10, 2026 | 12:24 PM

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న సినిమా రణబాలి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో దసరా కానుకగా అక్టోబర్ 16న విడుపదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంటరీస్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మూవీ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం రణబాలి ట్రైలర్ యూట్యూబ్, సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.ఈ క్రమంలోనే తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ మూవీ ట్రైలర్ చూసి చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు .

నారా లోకేష్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. “రణబలి ట్రైలర్ ఇప్పుడే చూశాను. వావ్, ఎంత అద్భుతమైన అనుభూతి కలిగింది. 1800ల నాటి రాయలసీమను పునఃసృష్టించడంలో, బ్రిటిష్ వారి కాలంలోని కరువు, అణచివేతతో నిండిన ఆ హృదయవిదారక యుగాన్ని చిత్రీకరించడంలో చూపిన శ్రద్ధ అసాధారణం. విజయ్ దేవరకొండ చాలా సునాయాసంగా, సీమ నేలలో పూర్తిగా ఇమిడిపోయినట్లుగా కనిపిస్తున్నారు. రష్మిక ఈ పాత్రకు అద్భుతంగా ప్రాణం పోశారు. చరిత్రలో మరుగునపడిన ఈ కథకు ప్రాణం పోసినందుకు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కు చిత్ర బృందానికి అభినందనలు. అక్టోబర్ 16న మీ అందరికీ గొప్ప విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నాము” అంటూ ట్వీట్ చేశారు.

కథ విషయానికి వస్తే.. 19వ శతాబ్దపు రాయలసీమ గడ్డపై బ్రిటిష్ పాలకులు సాగించిన అణచివేత, గుండెల్ని పిండేసే కరువు పరిస్థితులను ఈ సినిమాలో వాస్తవికంగా ఆవిష్కరించారని అన్నారు. ఈ సినిమాను అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..

నారా లోకేష్ ట్వీట్..

ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..

Loading...
Unable to load recommendations.
Follow Us