Anasuya : పోస్టల్ స్టాంప్‌పై అన‌సూయ ఫొటో.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. కారణాలు ఇలా ఉన్నాయి..

|

Feb 11, 2021 | 6:04 PM

Anasuya : జబర్ధస్త్‌ ఫేం అనసూయ యాంకరింగ్‌తో పాటు పలు సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తూ టాలీవుడ్‌లో తనకంటు

Anasuya : పోస్టల్ స్టాంప్‌పై అన‌సూయ ఫొటో.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. కారణాలు ఇలా ఉన్నాయి..
Follow us on

Anasuya : జబర్ధస్త్‌ ఫేం అనసూయ యాంకరింగ్‌తో పాటు పలు సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తూ టాలీవుడ్‌లో తనకంటు ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తన మాటలతో అభిమానులను మెస్మరైజ్ చేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పోస్టల్ స్టాంప్‌పై దర్శనమిస్తోంది. అనసూయ ఏంటి పోస్టల్ స్టాంపేంటి అనుకుంటున్నారా.. అయితే ఇది మీరు చదవాల్సిందే.

తెలంగాణ చిత్రపురి చలన చిత్రోత్సవం అందాల భామ అన‌సూయ‌ను గౌర‌విస్తూ ఆమె ఫొటోతో ఉన్న పోస్టల్ స్టాంప్‌తో స‌త్కరించింది. ఈ సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని తెలియ‌జేసిన అన‌సూయ వారికి కృత‌జ్ఞత‌లు తెలిపింది. జీవితంలో ఇంతకు మించిన అపారమైన గౌరవం ఏం ఉంటుందని చెబుతోంది. తనకు ఈ గౌరవం ద‌క్కినందుకు తెగ మురిసిపోతుంది. తనను ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నానికి తాను చేయగలిగినదంతా చేస్తానని ఎమోష‌న‌ల్ కామెంట్ పెట్టింది. అయితే పోస్టల్ స్టాంపుపై అనసూయ చిత్రాన్ని చూసిన ఆమె అభిమానులు ఆమెకు సోషల్ మీడియా కేంద్రంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై స‌త్తా చాటుతున్న సంగ‌తి తెలిసిందే.

అసలు రంగమ్మత్త అనసూయ కాదట.. మొదట తననే సంప్రదించారని చెబుతున్న అందాల నటి..