‘చావు కబురు చల్లగా’ స్పెషల్ సాంగ్‏లో జబర్ధస్త్ బ్యూటీ.. అనసూయ లుక్ అధుర్స్.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే..

|

Feb 15, 2021 | 5:54 PM

జబర్ధస్త్ యాంకర్ అనసూయ.. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై మోస్ట్ వాంటెడ్ నటిగా మారింది. వరుస సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ బ్యూటీ.

చావు కబురు చల్లగా స్పెషల్ సాంగ్‏లో జబర్ధస్త్ బ్యూటీ.. అనసూయ లుక్ అధుర్స్.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే..
Follow us on

Actress Anasuya Bharadwaj: జబర్ధస్త్ యాంకర్ అనసూయ.. అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై మోస్ట్ వాంటెడ్ నటిగా మారింది. వరుస సినిమాలు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది ఈ బ్యూటీ. తాజాగా అనసూయ చావు కబురు చల్లగా సినిమా స్పెషల్ సాంగ్‏లో నటిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో వరుస హిట్స్ కొడుతున్న బన్నీ వాసు నిర్మాతగా.. కొత్త డైరెక్టర్ కౌశిక్ ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. ఇప్పటికే కార్తికేయ బస్తి బాలరాజు ఫస్ట్ లుక్, ఇంట్రోకు విశేషస్పందన లభించింది. ఇటీవల లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ గ్లిప్స్‏కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో అనసూయ ఐటం సాంగ్ చేస్తుందనే వార్తలు గతంలో నెట్టింట్లో హల్ చల్ చేశాయి. తాజాగా అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తుందని చిత్రయూనిట్ అధికారింగా ప్రకటించింది. అవుడ్ అండ్ అవుట్ మాస్ బీట్స్‏తో సాగే ఈ పాటను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది చిత్రయూనిట్. ఈ సినిమాను మార్చి 19న విడుదరప చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

చావు కబురు చల్లగా మూవీ ట్వీట్..

Also Read:

ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…