Allu Arjun: కుటుంబ సభ్యులతో అడవి బాట పట్టిన పుష్పరాజ్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు..

|

Jul 05, 2022 | 3:17 PM

Allu Arjun: కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించే వారిలో నటుడు అల్లు అర్జున్‌ మొదటి వరుసలో ఉంటారు. నిత్యం సినిమాలతో టైట్‌ షెడ్యూల్‌తో బిజీగా ఉండే బన్నీ...

Allu Arjun: కుటుంబ సభ్యులతో అడవి బాట పట్టిన పుష్పరాజ్‌.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు..
Follow us on

Allu Arjun: కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించే వారిలో నటుడు అల్లు అర్జున్‌ మొదటి వరుసలో ఉంటారు. నిత్యం సినిమాలతో టైట్‌ షెడ్యూల్‌తో బిజీగా ఉండే బన్నీ కాస్త సమయం దొరికినా ఫ్యామిలీతో ట్రిప్‌లు వేస్తుంటాడు. విదేశాల్లోనే కాకుండా హైదరాబాద్‌ రోడ్లపై కూడా బన్నీ అప్పుడప్పుడు చక్కర్లు కొడుతుంటాడు. ఆ మధ్య ఓసారి దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌పై స్వయంగా కారు నడుపుతూ వెళ్లిన బన్నీ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా బన్నీ విదేశీ ట్రిప్‌ వేశాడు. ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌, ఇటీవల దొరికిన ఖాళీ సమయంలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. టాంజానీయా దేశంలోని నేషనల్‌ పార్క్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాడు. భార్య, కూతురు, కొడుకు అందరూ వైట్‌ డ్రస్‌లో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

స్నేహా రెడ్డి ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బన్నీ ఫ్యామిలీ అంతా వైట్‌ డ్రస్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. అలాగే అల్లు అర్జున్‌ గెటప్‌ ఇంకా పుష్ప రాజ్‌ పాత్రలోనే ఉంది. దీంతో పుష్ప2 విడుదల వరకు బన్నీ మరో సినిమాను పట్టాలెక్కించడనే విషయం అర్థమవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..