కలిసి వెళ్తే పెళ్లేనా..?

ఇటీవలే అలియా భట్, రణబీర్ కపూర్ యూరప్‌కు వెళ్లి వచ్చారు. అయితే.. వాళ్ల సడెన్‌ ట్రిప్‌పై ఓ ప్రచారం ఊపందుకుంది. వెడ్డింగ్ వెన్యూ కోసమే యూరప్‌కు వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఖండించింది అలియా భట్. మైండ్ రిలాక్సేషన్ కోసమే యూరప్‌కు వెళ్లాము తప్పించి వెండ్డింగ్ ప్లానింగ్ కోసం కాదని తేల్చి చెప్పింది. అలియా, రణబీర్ ఓ ఏడాదిగా డీప్‌ లవ్‌లో ఉన్నారు. చెట్టాపట్టాలేసుకుని తెగ షికార్లు చేసేశారు. మొదట్లో తమ రిలేషన్‌ షిప్ […]

కలిసి వెళ్తే పెళ్లేనా..?

Edited By:

Updated on: May 18, 2019 | 4:04 PM

ఇటీవలే అలియా భట్, రణబీర్ కపూర్ యూరప్‌కు వెళ్లి వచ్చారు. అయితే.. వాళ్ల సడెన్‌ ట్రిప్‌పై ఓ ప్రచారం ఊపందుకుంది. వెడ్డింగ్ వెన్యూ కోసమే యూరప్‌కు వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఖండించింది అలియా భట్. మైండ్ రిలాక్సేషన్ కోసమే యూరప్‌కు వెళ్లాము తప్పించి వెండ్డింగ్ ప్లానింగ్ కోసం కాదని తేల్చి చెప్పింది.

అలియా, రణబీర్ ఓ ఏడాదిగా డీప్‌ లవ్‌లో ఉన్నారు. చెట్టాపట్టాలేసుకుని తెగ షికార్లు చేసేశారు. మొదట్లో తమ రిలేషన్‌ షిప్ గురించి మాట్లాడేందుకు నిరాకరించినా.. రీసెంట్‌గా తమ ప్రేమ నిజమేనని ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆలియా, రణబీర్ కలిసి బ్రహ్మాస్త్ర అనే మూవీ చేస్తున్నారు. అలాగే ఆలియా సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా, బాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళితో మరో సినిమా చేస్తూ బిజీబిజీగా ఉంది.