Actress Anitha: మొన్న నిధి, నేడు అనిత.. బోల్డ్‌ ప్రకటనల్లో నటిస్తూ హద్దులు చెరిపేస్తోన్న హీరోయిన్స్‌..

|

Apr 14, 2022 | 3:25 PM

Actress Anitha: సీనీ తారలు ప్రకటనల్లో నటించడం సర్వసాధారణమైన విషయం. సెలబ్రిటీల బ్రాండ్ ఇమేజ్‌కు ఆధారంగా కంపెనీలు తమ వస్తువులను సినీ, క్రీడాకారులతో ప్రమోట్ చేసుకుంటాయి. అయితే ఏ వస్తువును ప్రమోట్‌ చేయాలి, దేనిని చేయకూడదనేది సదరు..

Actress Anitha: మొన్న నిధి, నేడు అనిత.. బోల్డ్‌ ప్రకటనల్లో నటిస్తూ హద్దులు చెరిపేస్తోన్న హీరోయిన్స్‌..
Follow us on

Actress Anitha: సీనీ తారలు ప్రకటనల్లో నటించడం సర్వసాధారణమైన విషయం. సెలబ్రిటీల బ్రాండ్ ఇమేజ్‌కు ఆధారంగా కంపెనీలు తమ వస్తువులను సినీ, క్రీడాకారులతో ప్రమోట్ చేసుకుంటాయి. అయితే ఏ వస్తువును ప్రమోట్‌ చేయాలి, దేనిని చేయకూడదనేది సదరు సెలబ్రిటీల ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నటీమణులు సబ్బులు, షాంపూలు యాడ్స్‌లో నటిస్తూ వచ్చేవారు. అయితే ప్రస్తుతం కాలం మారుతోంది, మారుతోన్న కాలానికి అనుగుణంగా సినీ తారల అభిప్రాయాల్లోనూ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా హీరోయిన్స్‌ విస్తృతంగా ఆలోచిస్తున్నారు. ఇటీవల నటీమణులు మద్యం కంపెనీల బ్రాండ్‌లను సైతం ప్రమోట్‌ చేస్తూ హీరోలకు పోటీనిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా అందాల తార నిధి అగర్వాల్‌ ఓ సంస్థకు చెందిన కండోమ్‌ యాడ్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కండోమ్‌ గురించి హీరోయిన్‌ వివరిస్తూ ఉన్న సదరు ప్రమోషన్‌ వీడియో చూసిన కొందరు అవాక్కయ్యారు. ఇక తాజాగా మరో హీరోయిన్‌ కూడా ఇదే బాటలో నడించింది. ఆ హీరోయిన్‌ మరెవరో కాదు ‘నువ్వు నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసిన అనిత. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ తన భర్తతో కలిసి ఇదే కండోమ్‌ సంస్థ ప్రమోషన్‌ వీడియోలో కనిపించింది. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది. కండోమ్‌ ఉపయోగాలను వివరిస్తూ అనిత చెప్పిన వ్యాఖ్యలు విన్న నెటిజన్లు ఒకింత షాక్‌ అయ్యారు.

ఇలా నటీమణులు బోల్డ్‌ యాడ్స్‌లో నటిస్తుండడం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. అయితే ఇలాంటి యాడ్స్‌లో హీరోయిన్లు నటించడం ఏంటి అంటూ కొందరు నెటిజన్లు ఘాటూగా కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం హీరోయిన్స్‌ గట్స్‌కు హాట్సాఫ్‌ చెబుతున్నారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్‌ తీసుకోవడమే కాకుండా హద్దులను చెరిపేస్తూ ఇలాంటి బోల్డ్‌ యాడ్స్‌లో నటించడంలో తప్పేంటి అంటూ వారికి మద్ధతు నిలుస్తున్నారు.

Also Read: PM Narendra Modi: ఏలూరు ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం.. మృతుల కుటుంబాలకు సంతాపం

Alia Ranbir Wedding: ఆలియా రణబీర్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి.. ఎట్టకేలకు ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్..

Bandi Sanjay: ఇవాళ్టి నుంచి ప్రజా సంగ్రామం.. అలంపూర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర..