తమిళ సినిమాకు అనుపమ గ్రీన్ సిగ్నల్.. ఈసారైనా హిట్ కొడుతుందా!

|

Jul 15, 2019 | 2:50 PM

మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత తెలుగులోకి డెబ్యూ ఇచ్చి వరుస హిట్స్‌ సాధించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. అయితే తాజాగా ఆమె నటించిన ‘తేజ్ ఐలవ్ యు’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాలు ప్లాప్స్ కావడంతో తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది ఇండస్ట్రీలపై కూడా దృష్టి పెట్టింది. ఇటీవలే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సరసన ‘నటసార్వభౌమ’ అనే చిత్రంలో నటించి […]

తమిళ సినిమాకు అనుపమ గ్రీన్ సిగ్నల్.. ఈసారైనా హిట్ కొడుతుందా!
Follow us on

మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత తెలుగులోకి డెబ్యూ ఇచ్చి వరుస హిట్స్‌ సాధించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. అయితే తాజాగా ఆమె నటించిన ‘తేజ్ ఐలవ్ యు’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రాలు ప్లాప్స్ కావడంతో తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది ఇండస్ట్రీలపై కూడా దృష్టి పెట్టింది.

ఇటీవలే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సరసన ‘నటసార్వభౌమ’ అనే చిత్రంలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. అలాగే తమిళంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది ఈ మలయాళ బ్యూటీ. ఎప్పుడో 2016లో మొదటి తమిళ చిత్రం చేసిన అనుపమ మళ్ళీ ఇప్పుడు కొత్త చిత్రానికి సైన్ చేసింది. అధర్వ మురళీ హీరోగా కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి మొదలుకానుంది.

మరోవైపు అనుపమ తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తున్న ‘రాక్షసుడు’ సినిమా ఆగష్టు 2న విడుదల కానుంది. కాగా ఇలా మొత్తం దక్షిణాది ఇండస్ట్రీలపై దృష్టి పెట్టిన ఈ కేరళ కుట్టికి అన్ని హిట్లే దక్కాలని కోరుకుందాం.