ఆయన లేకపోతే నేను సూపర్ స్టార్ అయ్యేదాన్ని కాదు.. ఇప్పుడు ఆయన కొడుకు పెద్ద హీరో.. విజయశాంతి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ దర్శకుడు లేకపోతే తాను ఇంత పెద్ద హీరోయిన్‌ను అయ్యేదాన్ని కాదని విజయశాంతి గారు భావోద్వేగంగా వెల్లడించారు. తనలోని నటనను గుర్తించి, గ్లామర్‌కు మించి ఒక నటిగా తనను నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని, ప్రతిఘటన సినిమా తన కెరీర్‌కు మలుపు అని ఆమె పేర్కొన్నారు.

ఆయన లేకపోతే నేను సూపర్ స్టార్ అయ్యేదాన్ని కాదు.. ఇప్పుడు ఆయన కొడుకు పెద్ద హీరో.. విజయశాంతి..
Viyashanti

Updated on: Nov 19, 2026 | 6:47 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విజయశాంతి. స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. అటు గ్లామర్ బ్యూటీగా, ఇటు యాక్షన్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి తన సినీ కెరీర్‌లో దివంగత దర్శకుడు, రచయిత టి. కృష్ణ గారి పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి. కృష్ణ గారు లేకపోతే తాను ఇంత పెద్ద హీరోయిన్‌ను అయ్యేదాన్ని కాదని, తన ఎదుగుదలకు ఆయనే ప్రధాన కారణమని విజయశాంతి భావోద్వేగంగా వెల్లడించారు. టి. కృష్ణ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉంటాయని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమలో తనను కేవలం గ్లామర్‌ హీరోయిన్‌గా మాత్రమే చూస్తున్న సమయంలో, తనలో అద్భుతమైన నటన ఉందని, దాన్ని వెలికితీసిన వ్యక్తి టి. కృష్ణ గారేనని విజయశాంతి పేర్కొన్నారు. ఓ విజయశాంతి ఓన్లీ గ్లామర్ కాదు, తను నటించగలుగుతుందని నిరూపించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna : తొలి సినిమాకే రికార్డు.. 1965లో సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే..

ఆయన రాసుకున్న విప్లవాత్మక కథలకు, పాత్రలకు తాను న్యాయం చేయగలనని, తన హావభావాలను బాగా రాబట్టగలనని ఆయన బలంగా విశ్వసించేవారని విజయశాంతి గుర్తుచేసుకున్నారు. అందుకే ఆయన తన అన్ని సినిమాల్లోనూ తననే నాయికగా కొనసాగించాలని పట్టుబట్టేవారని ఆమె వివరించారు. శాంతమ్మ అని ఆప్యాయంగా పిలిచే టి. కృష్ణ, తాను ఎప్పుడైనా వేరే నాయికను తీసుకోవాలని సూచించినా ఒప్పుకునేవారు కాదన్నారు. “అన్నా, మీకు బోర్ కొట్టదా? అన్ని సినిమాల్లో నేనేనా, వేరే హీరోయిన్‌ను పెట్టండి” అని ఒకసారి అడిగితే, “లేదు లేదు శాంతమ్మ, నువ్వే చేయాలి, నువ్వే బాగా చేస్తున్నావు” అని ఆయన చెప్పేవారని విజయశాంతి వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : నా భార్య ఎప్పుడూ నా పక్కన నడవదు.. కారణం చెప్పిన జగపతి బాబు..

టి. కృష్ణ గారు తనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనంగా ప్రతిఘటన సినిమా సంఘటనను విజయశాంతి వివరించారు. ఆ కథ విన్న తర్వాత చాలా బాగుందని అనిపించినా, అప్పట్లో డేట్స్ కుదరక బిజీగా ఉన్నానని, చేయలేనని టి. కృష్ణ గారికి చెప్పానన్నారు. అయితే ఆయన “నువ్వు చేయాలి, ఇది నువ్వు చేయకపోతే నేను చేయను” అని భీష్మించుకుని కూర్చున్నారని, దానితో నిర్మాతలకు కూడా ఏమీ చేయలేకపోయారని తెలిపారు. చివరికి, ప్రొడ్యూసర్లు అంతా కలిసి తనను ఒప్పించి, ఒక నెలకు మాత్రమే డేట్స్ సర్దుబాటు చేయించారని, వైజాగ్ వెళ్లి ఆ షెడ్యూల్ పూర్తి చేసుకున్నానని విజయశాంతి గుర్తుచేసుకున్నారు. తాను చేయలేను అనుకున్నది దేవుడు కూడా “నువ్వే చేయాలి” అన్నట్టు చేయించాడని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రతిఘటన సినిమానే తన కెరీర్‌కు ఒక మలుపు అని, ఈ సినిమాతోనే తనకు సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చిందని విజయశాంతి స్పష్టం చేశారు. దివంగత దర్శకుడు టి.కృష్ణ కుమారుడు మరెవరో కాదు.. హీరో గోపిచంద్.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవల ఆధారంగా వచ్చిన సినిమా.. శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ..

గోపిచంద్.

Gopichand

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us