
టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి చెప్పక్కర్లేదు. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత నమ్మకాలు, ముఖ్యంగా దిష్టి లేదా నజర్ గురించి తనకున్న విశ్వాసం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అనేక మంది సినీతారల మాదిరిగానే సంయుక్త కూడా కొన్ని మూఢనమ్మకాలు లేదా వ్యక్తిగత ఆచారాలను పాటిస్తారని స్పష్టమైంది. సంయుక్త మీనన్ తన జీవితంలో నజర్ లేదా దిష్టికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తాను దీనిని చాలా బలంగా నమ్ముతానని, తరచుగా దీని ప్రభావానికి లోనవుతానని వెల్లడించారు. ఏదైనా పబ్లిక్ ఈవెంట్‌కు వెళ్లిన తర్వాత కానీ, షూటింగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కానీ తరచుగా అనారోగ్యానికి గురవుతానని ఆమె వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna : తొలి సినిమాకే రికార్డు.. 1965లో సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే..
సాధారణంగా భారతీయ సంస్కృతిలో దిష్టి తగలకుండా ఉండటానికి లేదా దిష్టిని తీయడానికి అనేక సాంప్రదాయ పద్ధతులు ప్రచారంలో ఉన్నాయి. ఇళ్లలో ఉప్పుతో దిష్టి తీయడం, కొబ్బరికాయను ఉపయోగించడం, లేదా మిరపకాయలు, ఉప్పును కలిపి దిష్టి తీసి నిప్పులో వేయడం వంటివి సాధారణం. సంయుక్త మీనన్ అమ్మమ్మ పద్ధతులు కూడా ఇలాంటివేనని ఆమె పేర్కొన్నారు. మిరపకాయలు, ఇతర పదార్థాలను ఉపయోగించి బయట నిప్పులో వేసే పద్ధతిని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే, ప్రస్తుత అపార్ట్మెంట్ జీవనశైలిలో ఈ సాంప్రదాయ పద్ధతులను పాటించడం కష్టమని అన్నారు. ఈ కారణంగా తాను దిష్టిని నివారించడానికి తనదైన ఒక వినూత్నమైన, అపార్ట్మెంట్-స్నేహపూర్వక పద్ధతిని అలవర్చుకున్నానని అన్నారు. ఆమె కల్లు ఉప్పును తన స్నానం చేసే టబ్‌లో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తానని తెలిపారు. ఈ పద్ధతి తనకు చాలా బాగా పని చేస్తుందని, దిష్టి ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుందని ఆమె గట్టిగా నమ్ముతానని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : నా భార్య ఎప్పుడూ నా పక్కన నడవదు.. కారణం చెప్పిన జగపతి బాబు..
మన చుట్టూ ఉండే ఆరా కొన్నిసార్లు అవాంతరాలకు గురవుతుందని విషయంపై సంయుక్త మీనన్ దీనికి సమాధానమిస్తూ, తాను కూడా ఇదే విషయాన్ని నమ్ముతానని, ఉప్పు స్నానం ఈ శక్తిని సమతుల్యం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం సంయుక్త నిఖిల్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవల ఆధారంగా వచ్చిన సినిమా.. శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ..
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..