Anupama parameswaran: బ్లాక్‌ శారీలో తళుక్కుమన్న అనుపమ.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న ఫొటోలు.

|

Dec 10, 2022 | 8:22 AM

2015లో వచ్చిన 'ప్రేమమ్‌' చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తారత అనుపమ పరమేశ్వరన్‌. తొలి సినిమాతోనే తనదైన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అనంతరం తెలుగులో 'అఆ' సినిమాతో..

Anupama parameswaran: బ్లాక్‌ శారీలో తళుక్కుమన్న అనుపమ.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న ఫొటోలు.
Anupama Latest Photos
Follow us on

2015లో వచ్చిన ‘ప్రేమమ్‌’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తారత అనుపమ పరమేశ్వరన్‌. తొలి సినిమాతోనే తనదైన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అనంతరం తెలుగులో ‘అఆ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మెస్మరైజ్‌ చేసింది. ఇక అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే కెరీర్‌ తొలినాళ్ల నుంచి గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది అనుపమ. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ వస్తోంది.

అయితే ఇటీవల సోషల్ మీడియాలో వేదికగా మాత్రం కాస్త గ్లామరస్‌గా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తోందీ బ్యూటీ. తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ హీట్‌ పెంచుతోంది. ఈ క్రమంలోనే అనుపమ తాజాగా షేర్‌ చేసిన ఫొటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. బ్లాక్‌ శారీలో హొయలొలికిస్తూ దిగిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ‘ట్రాయల్‌ అండ్‌ ఎర్రర్‌’ అనే క్యాగ్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లను పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటో పోస్ట్‌ చేసిన క్షణాల్లో లక్షల్లో లైక్‌ల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక అనుపమ కెరీర్ విషయానికొస్తే ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న ’18 పేజీస్‌’తో పాటు బటర్‌ఫ్లై అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో మరో సినిమాతో బిజీగా ఉంది. మరి ఈ సినిమాలు అనుపమ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…