The Paradise : ది ప్యారడైజ్ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఆ ఒక్క కారణమే అంటున్న బ్యూటీ..

ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమా ది ప్యారడైజ్. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, న్యాచురల్ స్టార్ నాని కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని మిస్ చేసుకోవడంపై టాలీవుడ్ హీరోయిన్ స్పందించింది.

The Paradise : ది ప్యారడైజ్ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఆ ఒక్క కారణమే అంటున్న బ్యూటీ..
The Paradise

Updated on: Oct 04, 2026 | 8:46 AM

న్యాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ది ప్యారడైజ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. మ్యాడ్, 8 వసంతాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న అనంతిక సనీల్ కుమార్. ఇటీవల ఆమె నటించిన రొమాంచకం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అనంతిక మాట్లాడుతూ.. తన సినీ కెరీర్‌లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, పారడైస్ వంటి ఒక ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశాన్ని తాను ఎలా కోల్పోయారో వివరించారు. తన చిన్న వయసు రూపం, పాత్రకు సరిపోవడం కష్టమని భావించడం వల్లనే ఈ అవకాశం చేజారిందని ఆమె స్పష్టం చేశారు. “నేను చాలా చిన్నదాన్ని, నా లుక్స్ కారణంగానే చాలా ప్రాజెక్ట్‌లు మిస్ అయ్యాయి” అని అనంతిక తెలిపారు.

పారడైస్ మాత్రమే కాదు, తెలుగులో అగ్ర నటుడు నానితో కలిసి నటించే అవకాశం కూడా తన చిన్న వయసు రూపం కారణంగానే కోల్పోయినట్లు ఆమె వివరించారు. నాని తనకిష్టమైన తెలుగు హీరో అని, ఆయనతో కలిసి నటించే అవకాశం లభించలేదని చెప్పారు. అంతేకాకుండా, విజయ్ సేతుపతి వంటి పెద్ద తారలతో కలిసి నటించే పెద్ద తమిళ ప్రాజెక్ట్‌లను కూడా తన చిన్న వయసు కారణంగానే కోల్పోయినట్లు అనంతిక పేర్కొన్నారు. “వెరీ వెరీ బిఫోర్ నేను చాలా చిన్నది, అప్పుడు డైరెక్టర్ చెప్పారు హీరోయిన్‌కు కష్టం అంటే చిన్న పిల్ల అని అనుకోలేదు” అని ఆమె గుర్తు చేసుకున్నారు.

“అది అది చాలా ప్రాసెస్, అది అది చాలా పెద్ద కథ. నన్ను వద్దు వద్దు దాని గురించి మాట్లాడను అంటే దాని గురించి మాట్లాడలేను నేను” అని ఆమె అన్నారు. జరిగిన వాటిని వెనక్కి తిరిగి చూడకుండా, భవిష్యత్తులో వచ్చే అవకాశాలపైనే దృష్టి సారిస్తానని అనంతిక తన సానుకూల దృక్పథాన్ని వ్యక్తపరిచారు. “అయిపోయేది ఇంకా అయిపోద్ది కదా, మనం ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ కదా. ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏముందో అది చూస్తా అంతే కానీ బ్యాక్ కి” అని ఆమె తెలిపారు. తనకు నచ్చిన నటీనటుల గురించి అడగ్గా, నిత్యామీనన్ నటనకు తాను పెద్ద అభిమానినని, మలయాళంలో మోహన్‌లాల్, మమ్ముట్టి గార్లను చాలా ఇష్టపడతానని, తెలుగులో నాని అంటే తనకు చాలా ఇష్టమని అనంతిక వెల్లడించారు.\

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

అనంతిక సనీల్ కుమార్..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..

Loading...
Unable to load recommendations.
Follow Us