Aditi Rao Hydari: మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంటోన్న అందాల అదితి.. ఇన్‌స్టా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..

Aditi Rao Hydari: అందం, అభినయం కలగలిపిన నటీమణుల్లో అదితి రావు హైదరీ ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందీ చిన్నది...

Aditi Rao Hydari: మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంటోన్న అందాల అదితి.. ఇన్‌స్టా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్‌..

Updated on: Jul 18, 2022 | 6:30 AM

Aditi Rao Hydari: అందం, అభినయం కలగలిపిన నటీమణుల్లో అదితి రావు హైదరీ ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందీ చిన్నది. అందమైన రూపం, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ.. పేరుకు హైదరాబాదీ అయినా మలయాళం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. అనంతరం హిందీ వరుస సినిమాల్లో నటించిన ఈ చిన్నది.. సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌ను తన అందంతో అట్రాక్ట్‌ చేసిన అదితి.. అనంతరం అంతరిక్షం సినిమాలో తళుక్కుమంది.

తెలుగులో చివరిగా మహా సముద్రం సినిమాలో నటించిన అదితి రావు.. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఓవైపు సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన కెరీర్‌తో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమాలనుతో పంచుకోవడం ఈ అమ్మడుకి అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా అదితి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మేకప్‌ రూమ్‌లో అద్దంలో చూస్తున్న సమయంలోనే తీసిన ఫొటోను పోస్ట్‌ చేసిన అదితి ఇన్‌స్పిరేషన్‌ కొటేషన్‌ను పంచుకుంది. ఈ సందర్భంగా.. ‘మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇతరులు చూసే విధానంపై మీ సామర్థ్యం ఆధారపడి ఉండకూడదు. కలలు కనండి మీ కలలను నిజం చేసుకోండి. మీరు అందుకు అర్హులు’ అనే స్ఫూర్తిదాయక కొటేషన్‌ను రాసుకొచ్చింది. అదితి చేసిన ఈ పోస్ట్‌కు ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us