Tollywood: అనామకుడు సాయం అని ఫోన్ చేస్తే.. అర్థరాత్రి లుంగీతో వెళ్లిన స్టార్ హీరో..

శ్రీహరి గొప్ప నటుడని అందరికీ తెల్సు.. ఆయన అంతే మంచి వ్యక్తి కూడా. కష్టం అనే వస్తే చాలు.. వారు ఎవరనేది పట్టించుకోకుండా అడ్డంగా నిలబడతారు. శ్రీహరిగారి మంచితనానికి సంబంధించిన ఈ ఘటన గురించి చెప్తే మాత్రం.. ఈయన దేవుడు అని మీరే అంటారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం..

Tollywood: అనామకుడు సాయం అని ఫోన్ చేస్తే.. అర్థరాత్రి లుంగీతో వెళ్లిన స్టార్ హీరో..
Srihari
Follow us

|

Updated on: Apr 24, 2024 | 1:45 PM

తెలుగు తెరపై దివంగత శ్రీహరికి ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. విలన్‌గా, హీరోగా, కామెడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన విభిన్న పాత్రలు పోషించారు. ఎన్నో మంచి పాత్రలతో అలరించిన ఆయన.. తక్కువ వయస్సులోనే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. శ్రీహరి ఎంత గొప్ప నటుడో.. అంతకుమించి మంచి మనసున్న మనిషి. పైకి కండలు తిరిగిన దేహం గంభీరంగా కనిపించినా.. కష్టం అనగానే ఎవరికైనా సాయం చేస్తారు. వేషాల కోసం చిత్ర పరిశ్రమకు వచ్చి… తిండి లేక పస్తులు ఉండే ఎందరికో ఆయన ఆసరాగా నిలిచారు. చాలామందికి గుప్త దానాలు చేశారు. అయితే శ్రీహరిగారి గొప్పతనానికి సంబంధించిన ఈ ఘటన గురించి చెప్తే మాత్రం.. ఈయనరా అసలు మనిషంటే అంటారు. అప్పట్లో శ్రీహరి పక్కనే తిరిగిన డైరెక్టర్ బాబి  ఈ విషయాన్ని గతంలో పంచుకున్నారు.

“ శ్రీహరి గారి గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి.. ఆయనకు 2 ఫోన్లు ఉండేవి. ఒకటి వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించేవారు.. ఇంకోటి పబ్లిక్ నంబర్. ఇంటికొచ్చాక… కుటుంబంతో ఉంటారు కాబట్టి.. పర్సనల్ ఫోన్ ఎక్కడో పడేస్తారు. జనాలు, ఇండస్ట్రీకి తెలిసిన నంబర్ మాత్రం ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతారు. ఒకరోజు మిడ్ నైట్ ఆయనకు తెలియని నంబర్ నుంచి ఓ  ఫోన్ కాల్ వచ్చింది. ఆన్సర్ చేశారు. ఎవరో షిర్డి నుంచి హైదరాబాద్ బస్సులో వస్తున్న ఓ పర్సన్ చేశాడు. అతనితో పాటు వైఫ్, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఏడుస్తూ అతను అర్థం కాకుండా ఏదో చెబుతున్నాడు.  ఏయ్.. ఎవడ్రా నువ్వు…. ఏం కావాలి.. సరిగ్గా చెప్పు అని శ్రీహరి గారు గట్టిగా అరిచారు. అప్పుడు అతను సమస్యను వివరించారు.. షిర్డి నుంచి వస్తున్నప్పుడు.. బస్సులో లిక్కర్ తాగిన కొందరు ఉన్నారు. తన భార్యను, పిల్లల్ని వాళ్లు కామెంట్ చేస్తుంటే.. అతను వాళ్లపై రివర్స్ అయ్యాడు. దీంతో వాళ్లు హైదరాబాద్ వచ్చిన తర్వాత అంతు చూస్తామని ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ సమయంలో ఎవరికి ఫోన్ చేయాలో అతడికి తెలియలేదు. ఎవరి వద్ద నుంచో తీసుకున్న శ్రీహరి గారి నంబర్ అతడి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉంది. ఆయనకు ఫోన్ చేసి ప్రాబ్లం చెప్పాడు. సర్లే అయితే. టెంపుల్‌కు వెళ్లి వస్తున్నావు. గొడవ పడకు. మన మనుషఉలు వస్తారులే అని చెప్పి ఫోన్ పెట్టేశారు శ్రీహరి గారు. వేకువజామున ఐదున్నరకు బస్సు SR నగర్ వచ్చింది. ఆ బస్సులోని పర్సన్ శ్రీహరి గారికి ఫోన్ చేసి.. ఎవరైనా వచ్చారా అన్న అని అడిగాడు. ముందు బస్సులో నుంచి దిగమన్నారు శ్రీహరి గారు. అక్కడే ఎండివర్ కార్‌లో.. టీ షర్ట్, లుంగీలో.. నిద్రమత్తు కళ్లతో అక్కడ నిల్చున్నారు శ్రీహరి గారు. ఇది శ్రీహరి గారు అంటే” అని గతంలో ఎంతో ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు డైరెక్టర్ బాబీ.

Srihari

Srihari

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..
'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..
ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే...ముందుగా ఏం చేయాలో తెలుసా..?
పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే...ముందుగా ఏం చేయాలో తెలుసా..?
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..