Dhanush: చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే

ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి క్లాసిక్ మూవీస్ తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. అలాగే చివరిగా సాయి పల్లవి, నాగ చైతన్యతో కలిసి లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి, నాగ చైతన్య పోటీ పడి నటించారు. ఇక ఇప్పుడు ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల.

Dhanush: చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
Danush
Follow us

|

Updated on: May 06, 2024 | 12:50 PM

శేఖర్ కమ్ముల సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే యువతను కూడా ఆకట్టుకునే సినిమాలను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి క్లాసిక్ మూవీస్ తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. అలాగే చివరిగా సాయి పల్లవి, నాగ చైతన్యతో కలిసి లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి, నాగ చైతన్య పోటీ పడి నటించారు. ఇక ఇప్పుడు ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కుబేర అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  ఇటీవలే తిరుపతి లో కుబేర మూవీ షూటింగ్ జరిగింది. ఇక ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ధనుష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ధనుష్ చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ సన్నివేశం కోసం ధనుష్ ఓ డంపింగ్ యార్డ్ లో పది గంటలు గడిపారట.

ధనుష్ తన సినిమా పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటుంటాడు. ఇక ఇప్పుడు కుబేర సినిమా కోసం డంపింగ్ యార్డ్ లో చెత్త పక్కన పదిగంటలు గడిపారట. అది కూడా మాస్క్ లేకుండా.. ఉన్నారట. తన క్యారెక్టర్ లో ఎంత పెయిన్ ఉంటుందో చూపించాలని ధనుష్ ఇంత కష్టపడ్డారట. ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కూడా రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..