ఈ వయ్యారిని హత్తుకొనేదే అందానికి విలువ ఉండదేమో..
TV9 Telugu
06 May 2024
25 ఫిబ్రవరి 2000న కేరళలోని చంగనాచెరిలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఇవానా. అలీనా షాజీ ఈమె అసలు పేరు.
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీ నుంచి బికామ్ డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి.
12 ఏళ్ల వయస్సులోనే 2012 మలయాళీ చిత్రం మాస్టర్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది.
తమిళ చిత్రం నాచియార్‌లో ఈ బ్యూటీ నటనకి తమిళంలో సిమ్మా, ఫిల్మ్‌ఫేర్ వేదికల్లో ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డులు అందుకుంది.
ఈ వయ్యారి తండ్రి పేరు షాజీ చెరియన్. లియో, లయ అనే ఇద్దరు కవల సోదరుడు, సోదరి కూడా ఉన్నారు ఈ ముద్దుగుమ్మకి.
2022లో ప్రదీప్ రంగనాథన్ కి జోడిగా తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా లవ్ టుడేలో తొలిసారి కథానాయకిగా నటించింది.
తర్వాత 2023లో కోలీవుడ్ ఇండస్ట్రీలో LGM, మతిమారన్ అనే చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది ఈ అందాల భామ.
ప్రస్తుతం తెలుగు సెల్ఫీస్ అనే తెలుగు సినిమాలో యంగ్ హీరో ఆశిష్ రెడ్డి జోడిగా నటిస్తుంది. ఇది ఈ బ్యూటీ తొలి తెలుగు సినిమా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి