Devi Sri Prasad: స్టేజ్ పైనే దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్‌లో పెట్టాడా..?

బోయపాటి సినిమాలకు మ్యూజిక్ హైలైట్ అనే చెప్పాలి. ఆయన సినిమాల్లో మ్యూజిక్ చాలా స్పెషల్ గా ఉంటుంది. భద్ర, తులసి, లెజెండ్, జయ జానకి నాయక, వినయ విధేయ రామలాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలని మ్యూజికల్ గాను సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే దేవీ శ్రీకి, బోయపాటి శ్రీనుకు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే..

Devi Sri Prasad: స్టేజ్ పైనే దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్‌లో పెట్టాడా..?
Boyapati Srinu
Follow us

|

Updated on: May 06, 2024 | 12:20 PM

టాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా మంచి పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బోయపాటి శ్రీను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. అలాగే కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. బోయపాటి సినిమాలకు మాస్ క్రేజ్ ఉంటుంది. బోయపాటి సినిమాలకు మ్యూజిక్ హైలైట్ అనే చెప్పాలి. ఆయన సినిమాల్లో మ్యూజిక్ చాలా స్పెషల్ గా ఉంటుంది. భద్ర, తులసి, లెజెండ్, జయ జానకి నాయక, వినయ విధేయ రామలాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలని మ్యూజికల్ గాను సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే దేవీ శ్రీకి, బోయపాటి శ్రీను కు మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.. దాంతో బోయపాటి సినిమాలకు దేవీ మ్యూజిక్ అందించడం మానేశారు.

జయ జానకి నాయక సినిమా సక్సెస్ ఈవెంట్ లో దేవీ శ్రీ, బోయపాటి మధ్య మాటల యుద్ధం జరిగింది. బోయపాటి శ్రీను చెన్నైకి వెళ్లి తనతో 14 రోజుల పాటు పనిచేసిన తర్వాత డీఎస్పీ నుంచి ట్యూన్‌లు తీసుకున్నానని చెప్పడంతో అసలు గొడవ మొదలైంది. అసలు ఏం జరిగిందంటే..

‘నేను దేవిశ్రీను ఈ సినిమా కోసం  నిద్రకూడా పోనివ్వలేదు. దేవీ శ్రీ మ్యూజిక్ చేసినఅన్ని రోజులు నేను ఆయనతో ఉన్నాను’ అంటూ బోయపాటి చెప్పుకొచ్చారు. వెంటనే దేవి మైక్ తీసుకొని దానికి రివర్స్ పంచ్‌లు వేసేశాడు. బోయపాటి నన్ను నిద్రపోనివ్వడం ఏంటి.? సరైన మ్యూజిక్ ఇచ్చేంతవరకూ నేనే నిద్రపోను., నా పని నేను చేసుకున్నా.. బోయపాటి ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది చాలా తక్కువ. అది కూడా ల్యాప్ టాప్ లో ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ కుర్చున్నాడు అంటూ స్టేజ్‌పైనే దిమ్మతిరిగే పంచ్ వేసేశాడు. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆతర్వాత బోయపాటి సినిమాలకు దేవీ శ్రీ దూరంగా ఉంటూ వస్తున్నారు. దేవీ ప్లేస్ లోకి తమన్ ను తీసుకువచ్చారు బోయపాటి. ఈ ఇద్దరి కాంబోలో అఖండ, స్కంద సినిమాలు వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..