Gollapudi Maruti Rao: అప్పట్లో నా రెమ్యురేషన్ 10 రూపాయలు.. ఇక తులం బంగారం రేట్ ఎంత ఉందో తెలిస్తే..

దివంగత నటుడు, రచయిత మారుతి రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు నటుడిగా, కథకుడిగా, నవలా రచయితగా, జర్నలిస్టుగా తనదైన ముద్ర వేశారు. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా పరిచయమైన ఆయన మొదటి చిత్రంతోనే తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తన సినీ ప్రస్థానం గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిని ఆకర్షిస్తున్నాయి.

Gollapudi Maruti Rao: అప్పట్లో నా రెమ్యురేషన్ 10 రూపాయలు.. ఇక తులం బంగారం రేట్ ఎంత ఉందో తెలిస్తే..
Gollapudi Maruthi Rao

Updated on: Nov 11, 2026 | 8:02 AM

దివంగత నటుడు, రచయిత మారుతి రావు తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. నటుడిగా విలన్‌గా, హాస్యనటుడిగా, సహాయ నటుడిగా, తండ్రి, తాత పాత్రల్లో 250కి పైగా సినిమాల్లో నటించారు. ‘ఛాలెంజ్’, ‘సంసారం ఒక చదరంగం’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘ఆదిత్య 369’, ‘ముత్యమంత ముద్దు’, ‘స్వాతిముత్యం’, ‘యమలీల’ వంటి హిట్ చిత్రాలలో ఆయన నటన చిరస్మరణీయం. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, విలువలు, అనుభవాలను చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. తన తొలి పారితోషికం గురించి మాట్లాడుతూ, అది కేవలం రూ.10 మాత్రమేనని, అది కూడా 1959-61 సంవత్సరాల మధ్య అని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తులం బంగారం ధర రూ.100 మాత్రమే ఉండేదని అని అన్నారు.. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని, తన ప్రయాణంలో ఎదురైన ఆర్థిక అంశాలను వివరించడానికి ఈ పోలికను ఉపయోగిస్తున్నారని తెలిపారు.

మారుతి రావు గారు తన రచన పట్ల ఉన్న ప్రేమను, నటన పట్ల తనకున్న సంకోచాలను వివరించారు. తాను మొదట్లో నటనను అంతగా ఇష్టపడలేదని, అది ఒక బలవంతపు పనిగా భావించానని పేర్కొన్నారు. రాత్రి 11 గంటలకు కూడా షూటింగ్‌లు ఉంటే “ఈ దిక్కుమాలిన షూటింగు ఎందుకయ్యా, నన్ను చంపేస్తున్నారు” అని భావించేవారని తెలిపారు. నటన తన చేతిలో లేని ఒక సంఘటనలా తన జీవితంలోకి వచ్చిందని, దానిని స్వీకరించక తప్పలేదని ఆయన చెప్పుకొచ్చారు. జీవితంలో కొన్ని విషయాలు మనం కోరుకోకుండానే జరుగుతాయని, అవి జరిగినప్పుడు వాటిని స్వీకరించడమే మన ముందున్న ఏకైక మార్గం అని ఆయన పేర్కొన్నారు.

తాను గొప్ప నటుడిని అనిపించుకోలేకపోవడం వల్ల తనకేమీ నష్టం కలిగేది కాదని మారుతి రావు గారు స్పష్టం చేశారు. కానీ, తాను గొప్ప రచయితను కాదని అనిపించుకుంటే మాత్రం తన అహం దెబ్బతినేదని, అది తనకు చాలా ముఖ్యమని వివరించారు. ప్రస్తుతం, నటన, రచన రెండూ తన జీవితంలో కలిసిరావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అయినప్పటికీ, కష్టపడిన ప్రతిసారి, తన మనసులో ఒక మూలన “ఇది అవసరమా? దీని కోసం ఇంత శ్రమ పడాలా?” అనే ప్రశ్న తలెత్తుతుందని అన్నారు. ప్రముఖ నటులు జగ్గయ్య గారు ఒకసారి మారుతి రావు గారితో మాట్లాడుతూ, “మారుతి రావు గారు, మీరు ఇవాళ చెప్పి సాధించుకునే స్థాయికి వచ్చారు. ఒక ఆరు తర్వాత పని చేయను అని చెప్పండి, ఏమీ పర్వాలేదు” అని సలహా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ సలహాను తాను ఇప్పటికీ పాటిస్తానని, తన మేనేజర్‌కు కూడా సాయంత్రం ఆరు తర్వాత పని చేయనని, ఇష్టం ఉంటేనే చేస్తానని చెబుతానని వివరించారు. డబ్బు తనకి ఎక్కువ అవసరం లేదని, అయితే తన ప్రతిభను కేవలం డబ్బుతో కొలవడాన్ని తన అహం ఎప్పుడూ అంగీకరించదని మారుతి రావు గారు అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

Loading...
Unable to load recommendations.
Follow Us