
ప్రముఖ నటుడు బాబూమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలోని కొన్ని కఠినమైన, మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. దివంగత నటి సౌందర్యతో తన అనుబంధం గురించి వివరంగా వెల్లడించారు. బాబూమోహన్ తన పెద్ద కుమారుడి అకాల మరణాన్ని గుర్తు చేసుకున్నారు. మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని, పరీక్షలు రాసి తిరిగి వచ్చిన తన కుమారుడు హాలిడేస్‌లో ఉండగా జరిగిన బైక్ ప్రమాదం తన జీవితంలో చీకటి రోజు అని అన్నారు. ఆ తర్వాత చినుకు చినుకు పాటతో నటి సౌందర్యతో తన అనుబంధాన్ని బాబూమోహన్ ప్రస్తావించారు. ఈ పాట కేవలం ఒక సినిమాకు సంబంధించింది కాదని, వారిద్దరూ కలిసి ఐదు, ఆరు చిత్రాలలో నటించారని గుర్తు చేసుకున్నారు. ఒక దశలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తమతో నటించడానికి అభ్యంతరం చెప్పారని వార్తలు వచ్చాయని, అయితే నిర్మాతలు తనను కంపల్సరీగా కావాలని పట్టుబట్టారని తెలిపారు. దీంతో కథలను మార్చి, తనకు ప్రత్యేకంగా పాటలను జోడించారని, డిస్కో శాంతి, సిల్క్ స్మిత, జయలలిత వంటి వారితో తాను నటించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయని పేర్కొన్నారు. చివరికి దాసరి నారాయణరావు ముగ్గురినీ కలిసి నటించమని ఒప్పించారని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : బాబోయ్.. నెట్టింట గత్తరలేపుతున్న దండుపాళ్యం బ్యూటీ.. ఆమె ఇన్ స్టా చూస్తే..
సౌందర్య కెరీర్ ప్రారంభంలో తన పాత్ర గురించి బాబూమోహన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సౌందర్య మొదటి చిత్రం మనవరాలి పెళ్లి అని, అందులో తాను బావ పాత్రలో నటించానని తెలిపారు. అమ్మోరు సినిమా కోసం దర్శకులు కోడి రామకృష్ణ, శ్యాంబాబు సరైన అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు, ఈ అమ్మాయి (సౌందర్య) బాగా ఉంటుందని తనకు అనిపించిందని చెప్పారు. వెంటనే ఆమె రెండు ఫోటోలు తీయించి, మద్రాసు వెళ్లి కోడి రామకృష్ణకు ఇచ్చానని, మరుసటి రోజు ఆమెను ఎంపిక చేశారని వివరించారు. మొదట తన పక్కన నటించడానికి సౌందర్య సంశయించినా, అమ్మోరు విజయంతో ఆమెకు మంచి పేరు వచ్చిందని, ఐదు, ఆరు సినిమాలు బుక్ అయ్యాయని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Serial Song : పేరుకే సీరియల్ సాంగ్.. కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసిన పాట ఇది.. ఇప్పటికీ యూట్యూబ్‌లో తగ్గని డిమాండ్..
అమ్మోరు సినిమా తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు వంటి చిత్రాలతో సౌందర్య టాప్ హీరోయిన్‌గా ఎదిగిందని, తన సిఫార్సు వల్లే ఆమెకు ఈ అవకాశం వచ్చిందని ఆమె, ఆమె తండ్రి గర్వంగా చెప్పేవారని బాబూమోహన్ గుర్తు చేసుకున్నారు. బాబూమోహన్ మంచివాడు, సహాయపడే స్వభావం గలవాడు అని సౌందర్య తండ్రి అన్నారని కూడా ఆయన తెలిపారు. అయితే తన పక్కన నటిస్తే సౌందర్యకు ఛాన్సులు రావని చాలా మంది హెచ్చరించారనియ..అయినా పర్వాలేదని సౌందర్య చెప్పిందని గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: సినిమా మొత్తం హీరో ఒకే రంగు షర్ట్ లో ఉంటాడు.. హిట్టు కాదన్నారు.. థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా తర్వాత హీరోయిన్‌కు వెండి పళ్లెంలో పట్టు బట్టలు ఇచ్చాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..