బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కొత్త ఆన్ లైన్ పోస్టర్ ని విడుదల చేసింది. ఇందులో ‘ మోదీ దాదా’ అంటూ మోదీని ‘ అన్నయ్య’గా పేర్కొన్నారు. దాదా అంటే అన్న.. అటు ఓట్ ఫర్ దీదీ అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఇదివరకే తన ప్రచార నినాదాన్ని ఉధృతం చేయడంతో బీజేపీ ఇందుకు కౌంటర్ గా ఈ పోస్టర్ ని రూపొందించింది. మోదీ కి సంబంధించిన ఆన్ లైన్ పోస్టర్ ‘ఓట్ ఫర్ మోదీ దాదా ‘ అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. కాగా ‘ఆట మొదలైంది’ అని నిన్న తృణమూల్ కాంగ్రెస్ నినదించగా..ఇక మీ ఆటలు సాగవు అంటూ మోదీ సైతం ప్రకటించారు. ఇక మీ అట కట్టే అన్నారాయన., బీజేపీ సిండికేట్ అన్న టీఎంసి విమర్శను కూడా బీజేపీ నేతలు ఖండించారు. ఇలా బెంగాల్ ఎన్నికల పర్వంలో మెల్లగా ఒకదానికొకటి ప్రధాన పార్టీలు పోస్టర్లతో ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. కాగా మార్చి 27 న మొదటి దశ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా 5 గురు ఎమ్మెలేలు బీజేపీలో చేరడం విశేషం. అయితే దీదీ మాత్రం గుంభనంగా ఉన్నారు.
నిన్న సిలిగురిలో తాను నిర్వహించిన రోడ్ షో కు వేలాది మహిళలు తరలి రావడం ఆమెకు కొండత ధైర్యాన్ని ఇచ్చింది. కేంద్ర విధానాలను, వంటగ్యాస్ ధరలపెంపును ఈ సందర్భంగా ఆమె ప్రధానంగా ప్రస్తావించి మహిళలను ఆకట్టుకున్నారు .
మరిన్ని చదవండి ఇక్కడ :