Manipur Assembly Election 2022: మణిపూర్‌లో 8,650 లైసెన్సెడ్‌ తుపాకుల స్వాధీనం.. ఎన్నికల ప్రచారంలో హింసను అరికట్టేందుకే..

|

Dec 23, 2021 | 7:38 PM

వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో మణిపూర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే ఇటీవల

Manipur Assembly Election 2022: మణిపూర్‌లో 8,650 లైసెన్సెడ్‌ తుపాకుల స్వాధీనం.. ఎన్నికల ప్రచారంలో హింసను అరికట్టేందుకే..
Follow us on

వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో మణిపూర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే ఇటీవల క ఎన్నికల ప్రచారం సందర్భంగా  పలుచోట్ల  హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో హింసను అరికట్టేందుగా అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ లైసెన్సెడ్‌ తుపాకులను వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పటివరకు రాష్ట్రం మొత్తం మీద సుమారు 8,650 మందికి పైగా తమ ఆర్మ్‌డ్‌ లైసెన్స్‌లను పీఎస్‌లలో అప్పగించారని అధికారులు చెబుతున్నారు. ‘ మణిపూర్‌ మొత్తం మీద 25,300 మందికి లైసెన్స్‌డ్ ఆయుధాలు ఉన్నాయి. ఎన్నికల్లో హింసిన అరికట్టడంలో భాగంగా ఈ తుపాకులను సరెండర్‌ చేయాలని అన్ని నియోజకవర్గాలకు ఆదేశాలు జారీ చేశాం. అలా డిపాజిట్‌ చేయకపోతే ఆయుధాల చట్టం కింద వారు శిక్షార్హులు అవుతారు. ఇప్పటివరకు 8,650 మంది త ఆర్మ్ డ్‌ లైసెన్స్‌ గన్‌లను డిపాజిట్‌ చేశారు. త్వరలోనే మిగతా వారి నుంచి తుపాకులను స్వాధీనం చేసుకుంటాం’ అని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.

ఈ ఘటనల కారణంగానే…
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వేర్వేరు చోట్ల పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొంతమంది తమ లైసెన్స్‌డ్‌ గన్లను దుర్వినియోగపరుస్తూ కాల్పులకు పాల్పడుతున్నారు. ఫలితంగా పలువురు గాయపడుతున్నారు. ఇటీవల మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు రెండు చోట్ల శక్తివంతమైన బాంబులను అమర్చారు. అయితే ఈ రెండు పేలుళ్లు తెల్లవారుజాము జరగడంతో ఎవరూ గాయపడలేదు. ఇక నవంబర్ 13 చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో అస్సాం రైఫిల్స్ కల్నల్ విప్లవ్ త్రిపాఠితో సహా నలుగురు పారా మిలటరీ దళానికి చెందిన జవాన్లు మరణించారు. అత్యంత విషాదకరమైన విషయమేమిటంటే ఈ దాడిలో కల్నల్ త్రిపాఠి భార్య, వారి తొమ్మిదేళ్ల కుమారుడు కూడా మృత్యువాత పడ్డారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు మణిపూర్‌ ప్రభుత్వం లైసెన్సెడ్‌ గన్లను పీఎస్‌లలో డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

Amrapali Gan: మరో అంతర్జాతీయ కంపెనీ అధిపతిగా భారతీయ మహిళ.. ఓన్లీ ఫ్యాన్స్‌ సీఈవోగా ఆమ్రపాలి..

Covid New Guidelines: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

Radhe Shyam: ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్ర్కీన్‌పై రాధేశ్యామ్‌ స్పెషల్‌ షోస్‌.. అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం..