Goa Elections: గోవా ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ పాలేకర్.. ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్

|

Jan 19, 2022 | 1:40 PM

Amit Palekar: గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది . గోవాలో అమిత్ పాలేకర్‌కు పార్టీ ఈ బాధ్యతను అప్పగించింది .

Goa Elections: గోవా ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అమిత్ పాలేకర్.. ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్
Amit Palekar
Follow us on

Goa Assembly Election 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) నేత‌ృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ తర్వాత గోవా అసెంబ్లీ ఎన్నికల(Goa Assembly Election)కు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది . గోవాలో అమిత్ పాలేకర్‌(Amit Palekar)కు పార్టీ ఈ బాధ్యతను అప్పగించింది . ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అమిత్ వృత్తిరీత్యా న్యాయవాది, కానీ సామాజిక సేవలో చాలా చురుకుగా ఉంటారు. అందుకే గోవాలో జనాలు అతన్ని ఇష్టపడుతున్నారు. పేద ప్రజలకు సహాయం చేస్తూనే, అవినీతిపై కూడా చాలా సార్లు స్వరం వినిపించారు.

బుధవారం మీడియా సమావేశంలో అమిత్ పాలేకర్ పేరును కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ‘గోవా ప్రజలు ఇప్పటికే ఉన్న పార్టీలతో విసిగిపోయారు. నాయకులతో విసిగిపోయారు. అధికారంలో ఉంటూ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అధికారంలోకి వస్తారు. గోవా ప్రజలు మార్పు కోరుతున్నారు. వారికి ఆప్షన్లు లేవు, కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆప్ అభ్యర్థుల గెలిపించి, సామాజిక సేవకుడు అమిత్ పాలేకర్‌ను ఎన్నుకోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

కేజ్రీవాల్ మాట్లాడుతూ, ‘ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త పార్టీ. ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని సాధారణ గోవావాసులకు టిక్కెట్లు ఇచ్చామన్నారు. ఎవరి హృదయంలో నివాసం ఉంటుందో అతన్నే గోవా సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశామన్నారు. గోవా కోసం ఎవరి గుండె కొట్టుకుంటుంది, గోవా కోసం తన ప్రాణాలను కూడా అర్పించగలడు. అన్ని మతాల వారిని తన వెంట తీసుకెళ్తున్నాడు. ఉత్తర గోవా లేదా దక్షిణ గోవా ప్రజలు, వారు ఏ కులం లేదా ఏ మతానికి చెందినవారైనా. ఎవరూ మోసం చేయలేని విద్యావంతుడై ఉండాలి. అందుకే అమిత్ పారికర్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నామన్నారు. మొత్తం 40 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ చెప్పారు.


40 స్థానాలున్న గోవా శాసనసభ పదవీ కాలం మార్చి 15తో ముగుస్తుంది. ఈసారి గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. గోవాతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ తదితర నాలుగు రాష్ట్రాల్లో మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదిలావుంటే, జనవరి 8న గోవా తొలి జాబితాలో 10 మంది అభ్యర్థులను పార్టీ బరిలోకి దింపింది. జనవరి 9న విడుదల చేసిన రెండో జాబితాలో 10 మంది అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. జనవరి 12న విడుదల చేసిన జాబితాలో మరో 5 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన పార్టీ ఇప్పుడు నాలుగో జాబితాలో కూడా ఐదుగురు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. 10 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Read Also….  Budget 2022: NPS చందాదారులకు పన్ను మినహాయింపు లభించే ఛాన్స్.. బడ్జెట్ 2022పై ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆశలు..