రామచంద్రపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Vasamsetti Subash | 97652 | TDP | Won |
Surya Prakash Pilli | 71361 | YSRCP | Won |
Matha Rani Subrahmanyam | 1206 | BSP | Won |
Kota. Srinivas Rao | 1173 | INC | Won |
Jhai Sree Sureyendra Nadha Babuji Sreeguthula | 1079 | IND | Won |
Juttuka Venkatarao | 491 | PPOI | Won |
Yarramsetti Ramaraju | 246 | IND | Won |
Sujata Chekka | 172 | IND | Won |
Lanka. Praveen Kumar | 122 | IND | Won |
Barla Srinivas Yadav | 93 | BCYP | Won |
Chandra Sekhar Madiki | 78 | IND | Won |
Kate Subrahmanyam | 53 | IND | Won |
Koyya Bangaru Babu | 54 | IND | Won |
కోనసీమ జిల్లా రాజకీయాల్లో కాకరేపిన నియోజకవర్గం రామచంద్రపురం. ఇక్కడ ప్రస్తుతం మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ ఆయనను మరో నియోజకవర్గానికి మార్చి ఈ సీటును మాజీ మంత్రి పిల్లి తనయుడికి కేటాయించారు వైసిపి అధినేత. వైసిపిలో వర్గపోరు నేపథ్యంలో రామచంద్రపురం సీటు హాట్ టాపిక్ గా మారింది. రామచంద్రపురం వైసిపిలో హేమాహేమీ నాయకులు వున్నారు. మాజీ డిప్యూటీ సిఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పిల్లి, చెల్లుబోయిన ఈసారి రామచంద్రపురం టికెట్ ఆశించారు... అయితే వైసిపి అధిష్టానం మాత్రం పిల్లికే జై కొట్టింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ ను రామచంద్రపురం బరిలో నిలిపింది. తెలుగుదేశం పార్టీ వాసంశెట్టి సుభాష్ ను రామచంద్రపురం అభ్యర్థిగా ప్రకటించింది. 2014 లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులు ప్రస్తుతం వైసిపిలో వున్నారు. దీంతో సుభాష్ కు అవకాశం ఇచ్చింది టిడిపి.