పులివెందుల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
YS Jagan Mohan Reddy | 116315 | YSRCP | Won |
B.Tech Ravi | 54628 | TDP | Won |
Dhruvakumar Reddy Mulam Reddy | 10083 | INC | Won |
Nirmala Sure | 2582 | BCYP | Won |
Bellam Praveen Kumar Reddy | 958 | BSP | Won |
Emireddy Krishnareddy | 640 | IND | Won |
Shaik Dasthagiri | 544 | JRBHP | Won |
Gokana Palli Varaprasad Reddy | 242 | IND | Won |
Siva Chandra Reddy Komma | 233 | AYCP | Won |
Chandrasekhar Reddy Sivaiah Gari | 210 | IND | Won |
Vijay Kumar Reddy Akkulugari | 202 | RSP | Won |
Karna Ramesh Kumar Reddy | 146 | AIFB | Won |
Pandillapalli.Ramagangireddy | 113 | IND | Won |
Sanjeeva Reddy Devireddy | 118 | IND | Won |
Lingala Rama Linga Reddy | 119 | RJD | Won |
Raghava Reddy Tugutla | 69 | NVCP | Won |
Thaufiq Syed | 75 | IND | Won |
Mahammad Darbar Basha Nimmakayala | 50 | IND | Won |
Venkatasredhar Reddy Puppala | 57 | IND | Won |
Ravitheja Reddy Ajuguttu | 54 | RPOI (A) | Won |
Maheswara Reddy Tallapalle | 50 | IND | Won |
Gavireddy Rameswara Reddy | 62 | PPOI | Won |
Madem Pushpanatha Reddy | 37 | JANSS | Won |
Vijaya Bhaskar Reddy Lomada | 36 | IND | Won |
Kancherla Venkata Sarvothama Reddy | 32 | SUPRP | Won |
Dasari Ravi Sankar | 43 | JBNP | Won |
Yadiki Boreddy Chinna Yerikala Reddy | 30 | ARPS | Won |
పులివెందుల అనగానే ముందుగా వినపడే పేరు వైఎస్ ఫ్యామిలీ. అంతగా ఆ పేరుతో పెనవేసుకుపోయింది. నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మంచి ప్రజాదరణ ఉంది. రాష్ట్రరాజకీయాల్లో నేతలు బిజీగా ఉన్నా ఆ కుటుంబాన్ని అక్కడి ప్రజలు గెలిపిస్తూనే వస్తున్నారు. అది కూడా భారీ మెజారిటీతోనే..! పులివెందుల మెజారిటీతోనే కడప పార్లమెంటు స్థానాన్ని ప్రతిసారీ ఆ పార్టీ గెలుచుకుంటూ వస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ పురుషోత్తమ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్.. ఇలా ఐదుగురు పులివెందుల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట. దశాబ్దాలుగా అక్కడ వాళ్లే నెగ్గుతూ వస్తున్నారు. 1978లో వైఎస్. రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన కుటుంబీకులే ఇక్కడ రాజ్యమేలుతున్నారు. ఆప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా వైసీపీ పెట్టుకుని గెలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ వైఎస్ కుటుంబానికి తిరుగు లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కుటుంబానికి ప్రాణాలిచ్చే అభిమానులున్నారంటే ఆతిశయోక్తి కాదు.