పెనమలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Bode Prasad 144912 TDP Won
Jogi Ramesh 84997 YSRCP Won
Elisala Subramanyam 2596 INC Won
Somu Maheswara Rao (Mahesh Yadav) 716 BSP Won
Chakka Yedukondalu 585 PPOI Won
Pachipala Kanaka Durga Rao 458 IND Won
Gurrala Harshitha 185 BCYP Won
Sasidhar Mareedu 165 TELRSP Won
Maradani Viezayaa 145 IND Won
Sadarla Prasada Rao 130 JRBHP Won
Gogam Ramu 140 IND Won
పెనమలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం : ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన నియోజకవర్గాలలో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.. పెనమలూరు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఉంది. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పెనమలూరు ఒకటి.. ఈ నియోజకవర్గంలో మొత్తం 267,751 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కంకిపాడు, వుయ్యూరు, పెనమలూరు మండలాలు ఉన్నాయి. డిలిమిటేషన్ ఆర్డర్స్ (2008) ప్రకారం 2008లో నియోజకవర్గాన్ని స్థాపించారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో YSR కాంగ్రెస్ పార్టీకి చెందిన కొలుసు పార్థ సారథి గెలుపొందారు. అంతకుముందు 2009లో కొలుసు పార్థసారథి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఈ నియోజకవర్గంలో 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి బోడే ప్రసాద్ గెలుపొందారు.
పెనమలూరులో ప్రధానంగా వైసీపీ, తెలుగుదేశం మధ్య ప్రధాన పొటీ నెలకొంది. కాగా.. పెనమలూరులో వైసీపీ నుంచి మంత్రి జోగి రమేష్ 2024 ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.

అన్న అప్పుడు.. తమ్ముళ్లు ఇప్పుడు.! మెగా బ్రదర్స్.. మెగా హిట్..

రావడం కాస్త లేటవ్వచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా.. ఈ డైలాగ్ గుర్తుందా.. ఇది ఇప్పుడు మెగా ఫ్యామెలీకి పెర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎప్పుడో 80వ దశకంలో మెగాస్టార్‌తో మొదలైన కొణిదెల ఫ్యామెలీ వెండితెర ప్రయాణం దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతునే ఉంది. చిరంజీవి తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ల ఫ్యామెలీ మెంబర్స్ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ వచ్చారు. చిరు తర్వాత నాగబాబు నటుడిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగించగా.. ఆ తర్వాత వచ్చిన పవన్ కల్యాణ్.. పవర్ స్టార్‌గా ఇండస్ట్రీని శాసిస్తూ వస్తున్నారు.

తిరుపతి లడ్డూ కల్తీపై ఘాటుగా స్పందించిన ఖుష్బూ

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి లడ్డూ కల్తీ కావడం పట్ల తిరుపతిని శుద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటి ఖుష్బూ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఎక్స్‌లో ఆమె తను అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈవీఎంలపై వైసీపీ - కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌..

ఏపీలో ఈవీఎం కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ- కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌ పీక్స్‌కు చేరింది. ఈవీఎం రీ -వెరిఫికేషన్‌కు పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. ఫలితాలు ప్రకటించిన రెండు నెలలకు అనుమానాలా ! అన్ని ప్రశ్నిస్తున్నారు కూటమి నాయకులు. ఫిర్యాదు సరే మరి ఈసీ రియాక్షన్‌ ఏంటి?

నిలిచిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ.. బాలినేని కీలక వ్యాఖ్యలు..

ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన 12 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు గైడ్‌ లైన్స్‌ ప్రకారం రీవెరిఫికేషన్‌ జరగడం లేదంటూ మాక్‌ పోలింగ్‌కు హాజరైన వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీవెరిఫికేషన్‌ ప్రక్రియను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్ళిపోయారు.

లక్కీ ఛాన్స్ కొట్టేస్తున్న మహిళా టీచర్లు..!

ఏపీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ట్రెండు ఇప్పుడేమి కొత్తగా మొదలైందీ కాదు..! ఓ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అన్నట్లు ఇక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇక్కడ అదే ట్రెండు ఫాలో అవుతూ జాక్‌పాట్ కొట్టేస్తున్నారు ఆ మహిళా నేతలు.

'వెల్‌కమ్‌ చీఫ్'.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మనోజ్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఏపీ క్యాబినేట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన పదవి దక్కింది. వీటితో పాటు పవన్ ఆశించిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అలాగే పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను జనసేన అధినేతకు అప్పగించారు.

మహిళలా మజాకా.. దేశంలో 33శాతం రిజర్వేషన్ లేకుండానే 55శాతం విజయం..

చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ దశాబ్దాలుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోయినా ఆ జిల్లాలో మాత్రం 55% శాతం మహిళలే చట్టసభలకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఆ జిల్లాను నడుపుతున్న అధికారులు సైతం మహిళలే కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకీ 50 శాతం దాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడ మహిళలు ఎవరు? అనుకుంటున్నారా? అదే ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన విజయనగరం.

ఏపీ ఫలితాల తర్వాత వైసీపీకి మరో అగ్నిపరీక్ష.. రంగంలోకి కీలక నేతలు

ఎన్నికలు ముగిశాయి. కూటమికి అనూహ్య విజయం లభించింది. కనీవిని ఎరుగని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎ల పై దృష్టి సారించాయి. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎లు వైసిపి నాయకత్వంలోనే ఉన్నాయి. వాటిన్నంటిపై దృష్టిసారించింది కూటమి. ముందుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‎పై కూటమి నేతలు దృష్టి సారించారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు గానూ విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి.

ఆవిధంగా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదు.. ఈ అధికారులపై ఫోకస్

తన పరిపాలన ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ మీటింగ్‌లోనే శాంపిల్‌ చూపించారు సీఎం చంద్రబాబు. తన ప్రాధాన్యతలేంటో, ప్రజలు ఆకాంక్షలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చారు. అదే టైమ్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై హాట్‌ కామెంట్స్‌ చేశారు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే అఖిలభారత సర్వీస్‌ అధికారులతో సమావేశమయ్యారు చంద్రబాబు. పాలనలో కీలకమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లతో కాసేపు మాట్లాడారు. తనపై ఎంతో పెద్ద బాధ్యత ఉందంటూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Srikar T
  • Updated on: Jun 14, 2024
  • 6:15 AM

పవర్ స్టార్ ఫ్యాన్ అంటే మామూలుగా ఉండదు.. శపథం చేసి చివరకు..

ఈ ఫోటోలో ఉన్నది ఆడా.. మగా అర్ధం కావట్లేదా. మరొక్కసారి బాగా చూడండి అయినా అర్ధం కాకపోతే పూర్తి వివరాలు చదవాలి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇతని పేరు తోట నరేంద్ర. ఊరు.. తెనాలి సమీపంలోని కొలకలూరు. అది 2019వ సంవత్సరం.. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అతని అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో నరేంద్ర తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ నాయకుడు రెండు చోట్ల పరాజయం పాలవ్వడం తీవ్ర వేదనకు గురి చేసింది.

ఎన్నికల వీడియో