మండపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Jogeswara Rao.V | 116309 | TDP | Won |
Thota Trimurthulu | 71874 | YSRCP | Won |
Kamana Prabhakara Rao | 1484 | INC | Won |
Satyanarayana Marni | 1161 | IND | Won |
Gurrapu Kottiyya | 453 | BSP | Won |
Nalla Chinna Rao | 293 | LIBCP | Won |
Srikrishna Kona | 152 | IND | Won |
Veera Venkata Satyanarayana Kona | 157 | IND | Won |
Nandikolla Raju | 131 | NVP | Won |
Rayudu Srinivasu | 140 | IND | Won |
Sadey. David Raju | 120 | RPI(A) | Won |
Mandapalli Ravi | 101 | IND | Won |
Kona Surya Bhaskara Rao | 103 | IND | Won |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల్లో మండపేట ఒకటి. కోనసీమ జిల్లాలోని ఒక నియోజకవర్గం ఈ మండపేట. ఇది అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీకి చెందిన వి.జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 214,324 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్(2008) ప్రకారం 2008లో నియోజకవర్గం స్థాపించబడింది. మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మూడు మండలాలుగా ఉన్నాయి. ఇక ఈ నియోజవర్గంలో గడిచిన మూడు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. మూడుసార్లు టీడీపీ ఎమ్మెల్యే వి.జోగేశ్వరరావు విజయఢంకా మోగించారు. ఒకరకంగా ఇది టీడీపీ కంచుకోట అని చెప్పొచ్చు. 2009లో ప్రజారాజ్యం పార్టీ వివిఎస్ఎస్ చౌదరిపై సుమారు 18 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ నేత జోగేశ్వరరావు గెలుపొందగా.. 2014లో వైసీపీ అభ్యర్ధి స్వామినాయుడిపై 36 వేల ఓట్ల మెజార్టీతో, 2019లో వైసీపీ అభ్యర్ధి పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు టీడీపీ ఎమ్మెల్యే వి.జోగేశ్వరరావు.