AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మచిలీపట్నం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Kollu Ravindra 105044 TDP Won
Perni Krishnamurthy (Kittu) 54802 YSRCP Won
Abdul Mateen 1443 INC Won
Kona Nagarjuna 838 BCYP Won
Sowdada Balaji 500 BSP Won
Vakkalagadda Pavani 198 PPOI Won
Lakshmi Kiran Kunapareddy 187 IND Won
Adothu Thulasiram 162 TELRSP Won
Angara Chamundeswari 142 IND Won
Ede Bhaskara Rao 134 IND Won
Suneel Babu Kotaprolu 136 IND Won
Chinthapalli Manohar 98 IND Won
Arifpasha Shaik 67 IND Won
Ammireddy Rajani 61 IND Won
మచిలీపట్నం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల్లో మచిలీపట్నం ఒకటి. కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గం ఈ మచిలీపట్నం. ఇది మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి వైసీపీ పార్టీకి చెందిన పేర్ని వెంకటరామయ్య(పేర్ని నాని) ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 184,506 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్(2008) ప్రకారం 2008లో నియోజకవర్గం స్థాపించబడింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం మచిలీపట్నం మండలం మాత్రమే ఉంది. ఇక 2009 నుంచి 2019 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే.. ఒకసారి కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, ఒకసారి వైసీపీ పార్టీలు ఈ మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొందాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ తన సమీప టీడీపీ అభ్యర్ధి కొల్లు రవీంద్రపై గెలుపొందారు పేర్ని నాని. 2014లో టీడీపీ అభ్యర్ధి కొల్లు రవీంద్ర తన సమీప వైసీపీ అభ్యర్ధి పేర్ని నానిపై విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో మళ్లీ వీళ్లిద్దరి మధ్య పోటీ జరగ్గా.. సుమారు 6 వేల మెజార్టీతో వైసీపీ నేత పేర్ని నాని.. టీడీపీ నేత కొల్లు రవీంద్రపై విజయం సాధించారు.

అన్న అప్పుడు.. తమ్ముళ్లు ఇప్పుడు.! మెగా బ్రదర్స్.. మెగా హిట్..

రావడం కాస్త లేటవ్వచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా.. ఈ డైలాగ్ గుర్తుందా.. ఇది ఇప్పుడు మెగా ఫ్యామెలీకి పెర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎప్పుడో 80వ దశకంలో మెగాస్టార్‌తో మొదలైన కొణిదెల ఫ్యామెలీ వెండితెర ప్రయాణం దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతునే ఉంది. చిరంజీవి తర్వాత ఒక్కొక్కరుగా వాళ్ల ఫ్యామెలీ మెంబర్స్ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ వచ్చారు. చిరు తర్వాత నాగబాబు నటుడిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగించగా.. ఆ తర్వాత వచ్చిన పవన్ కల్యాణ్.. పవర్ స్టార్‌గా ఇండస్ట్రీని శాసిస్తూ వస్తున్నారు.

తిరుపతి లడ్డూ కల్తీపై ఘాటుగా స్పందించిన ఖుష్బూ

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి లడ్డూ కల్తీ కావడం పట్ల తిరుపతిని శుద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటి ఖుష్బూ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఎక్స్‌లో ఆమె తను అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈవీఎంలపై వైసీపీ - కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌..

ఏపీలో ఈవీఎం కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ- కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌ పీక్స్‌కు చేరింది. ఈవీఎం రీ -వెరిఫికేషన్‌కు పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. ఫలితాలు ప్రకటించిన రెండు నెలలకు అనుమానాలా ! అన్ని ప్రశ్నిస్తున్నారు కూటమి నాయకులు. ఫిర్యాదు సరే మరి ఈసీ రియాక్షన్‌ ఏంటి?

నిలిచిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ.. బాలినేని కీలక వ్యాఖ్యలు..

ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన 12 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు గైడ్‌ లైన్స్‌ ప్రకారం రీవెరిఫికేషన్‌ జరగడం లేదంటూ మాక్‌ పోలింగ్‌కు హాజరైన వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీవెరిఫికేషన్‌ ప్రక్రియను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్ళిపోయారు.

లక్కీ ఛాన్స్ కొట్టేస్తున్న మహిళా టీచర్లు..!

ఏపీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ట్రెండు ఇప్పుడేమి కొత్తగా మొదలైందీ కాదు..! ఓ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అన్నట్లు ఇక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇక్కడ అదే ట్రెండు ఫాలో అవుతూ జాక్‌పాట్ కొట్టేస్తున్నారు ఆ మహిళా నేతలు.

'వెల్‌కమ్‌ చీఫ్'.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మనోజ్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఏపీ క్యాబినేట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన పదవి దక్కింది. వీటితో పాటు పవన్ ఆశించిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అలాగే పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను జనసేన అధినేతకు అప్పగించారు.

మహిళలా మజాకా.. దేశంలో 33శాతం రిజర్వేషన్ లేకుండానే 55శాతం విజయం..

చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ దశాబ్దాలుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోయినా ఆ జిల్లాలో మాత్రం 55% శాతం మహిళలే చట్టసభలకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఆ జిల్లాను నడుపుతున్న అధికారులు సైతం మహిళలే కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకీ 50 శాతం దాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడ మహిళలు ఎవరు? అనుకుంటున్నారా? అదే ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన విజయనగరం.

ఏపీ ఫలితాల తర్వాత వైసీపీకి మరో అగ్నిపరీక్ష.. రంగంలోకి కీలక నేతలు

ఎన్నికలు ముగిశాయి. కూటమికి అనూహ్య విజయం లభించింది. కనీవిని ఎరుగని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎ల పై దృష్టి సారించాయి. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎లు వైసిపి నాయకత్వంలోనే ఉన్నాయి. వాటిన్నంటిపై దృష్టిసారించింది కూటమి. ముందుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‎పై కూటమి నేతలు దృష్టి సారించారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు గానూ విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి.

ఆవిధంగా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదు.. ఈ అధికారులపై ఫోకస్

తన పరిపాలన ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ మీటింగ్‌లోనే శాంపిల్‌ చూపించారు సీఎం చంద్రబాబు. తన ప్రాధాన్యతలేంటో, ప్రజలు ఆకాంక్షలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చారు. అదే టైమ్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై హాట్‌ కామెంట్స్‌ చేశారు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే అఖిలభారత సర్వీస్‌ అధికారులతో సమావేశమయ్యారు చంద్రబాబు. పాలనలో కీలకమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లతో కాసేపు మాట్లాడారు. తనపై ఎంతో పెద్ద బాధ్యత ఉందంటూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Srikar T
  • Updated on: Jun 14, 2024
  • 6:15 AM

పవర్ స్టార్ ఫ్యాన్ అంటే మామూలుగా ఉండదు.. శపథం చేసి చివరకు..

ఈ ఫోటోలో ఉన్నది ఆడా.. మగా అర్ధం కావట్లేదా. మరొక్కసారి బాగా చూడండి అయినా అర్ధం కాకపోతే పూర్తి వివరాలు చదవాలి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇతని పేరు తోట నరేంద్ర. ఊరు.. తెనాలి సమీపంలోని కొలకలూరు. అది 2019వ సంవత్సరం.. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అతని అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో నరేంద్ర తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ నాయకుడు రెండు చోట్ల పరాజయం పాలవ్వడం తీవ్ర వేదనకు గురి చేసింది.

ఎన్నికల వీడియో