కడప అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Madhavi Reddappa Gari | 90988 | TDP | Won |
Amzath Basha Shaik Bepari | 72128 | YSRCP | Won |
Tumman Kalyan Afzal Ali Khan | 24500 | INC | Won |
Venkata Subba Reddy Raju | 360 | BSP | Won |
Pattupogula Pavan Kumar | 285 | NMSP | Won |
Paneti Sudhakar | 155 | IND | Won |
Shaik Mahaboob Basha | 116 | AYCP | Won |
Settypalle Subramanyam | 105 | RPOI | Won |
Dwarakanath Reddy Vempalli | 111 | IND | Won |
Avvaru Mallikarjuna | 117 | JCVIVP | Won |
Shaik Ali Share | 69 | IUML | Won |
Ahmed Basha Shaik Bepari | 85 | IND | Won |
Lomada Chandra Mohan Reddy | 64 | IND | Won |
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కడప నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహరాలశాఖ మంత్రి అంజాద్ భాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గం రాయలసీమకు గడపలాంటిది. అందుకే ప్రధాన పార్టీలు గట్టిఫోకస్ పెడుతుంటాయి. మరి, ప్రజల అభిమానం ఎలా ఉంటదంటే.. ఎన్నికల్లో అభ్యర్థుల్ని అస్సలు చూడరు. వాళ్లు పట్టుకున్న జెండా కలర్‌ని మాత్రమే చూస్తారు. ప్రధానంగా అక్కడున్నది బులుగు జెండానా.. పసుపు జెండానా అన్నది మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. క్యాండిడేట్ ఎవరైనా డోన్ట్ కేర్.. పార్టీ ఫ్లాగ్ ఈజ్ వెరీ పవర్‌ఫుల్.. దశాబ్ధాలుగా ఇదే జరుగుతోంది. ఎప్పుడో పార్టీ పెట్టిన కొత్తలో టీడీపీ ఓసారి గెలిచింది. మళ్లీ ఇంతవరకు గెలుపు దరిదాపులకు కూడా చేరలేకపోతోంది. అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత కడప స్థానానికి 1952లో తొలి ఎన్నిక జరిగింది. అప్పటి నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. 1994 ఎన్నికల్లో టీడీపీ వ్యూహం మార్చి మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపి ఘనవిజయాన్ని దక్కించుకుంది. కడప పట్టణం పరిధిలో మైనారిటీ అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో అప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులుగా వారినే బరిలోకి దింపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా వైసీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి బరిలోకి దిగబోతున్నారు.