గన్నవరం (కృష్ణా) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Yarlagadda Venkata Rao | 135552 | TDP | Won |
Vamsi Vallabhaneni | 97924 | YSRCP | Won |
Kallam Venkateswararao | 1219 | CPM | Won |
Tadanki Jagdish Ramachandra Rao | 704 | TELRSP | Won |
Vallabhaneni Mohan Vamsi Krishna | 636 | IND | Won |
Potluri Ravindra Kumar | 602 | RPI (Athawale) | Won |
Korrapolu Srinivasa Rao | 349 | IND | Won |
Dondapati Anand Prasad | 256 | AIFB | Won |
Sarnala Vijayadurga | 203 | IND | Won |
Aruna Kumari Prathipati | 147 | IND | Won |
Potluri Sreedevi | 95 | IND | Won |
Guntupally Umamaheswararao | 107 | IND | Won |
కృష్ణా జిల్లాలోని ఒక శాసనసభ నియోజకవర్గం ఈ గన్నవరం. గన్నవరం 1955లో నియోజకవర్గంగా ఏర్పడింది. గన్నవరం, ఉంగుటూరు మండలాలు, కంకిపాడు మండలంలోని రెండు, బాపులపాడు మండలంలోని తొమ్మిది గ్రామాలు, ఉయ్యూరు మండలంలోని రెండు గ్రామాలు కలిపి ఈ గన్నవరం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. పునర్విభజన తర్వాత గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలోని గ్రామాలు పూర్తిగా, విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలతో ఈ గన్నవరం నియోజకవర్గాన్ని పునర్విభజించారు. తూర్పున ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు, పడమరన విజయవాడ రూరల్ మండలంలోని పి.నైనవరం, దక్షిణాన రామవరప్పాడు, ఉత్తరాన బొమ్ములూరు గ్రామాలు నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ప్రముఖులు చక్రం తిప్పారు. కవి విశ్వనాథ సత్యనారాయణ, పారిశ్రామిక వేత్త దాసరి జైరమేష్, తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్.రామ్మోహనరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి రామ్మోహనరావు, గద్దె రామ్మోహనరావు, తానా అధ్యక్షుడు టీబీఆర్ ప్రసాద్, కేవీపీ రామచంద్రరావు వంటి వారు ఈ లిస్టులో ఉన్నారు. ఇక గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం 2014, 2019 ఎన్నికల ఫలితాలు ఒకసారి పరిశీలిస్తే.. టీడీపీకి చెందిన వల్లభనేని వంశీమోహన్ రెండుసార్లు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు ఈ నియోజకవర్గం ప్రస్తుతం కంచుకోట.