ఆచంట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అభ్యర్థి పేరు | మొత్తం ఓట్లు | పార్టీ | స్థితి |
---|---|---|---|
Satyanarayana Pithani | 85402 | TDP | Won |
Cherukuvada Sri Ranganadha Raju | 58848 | YSRCP | Won |
Nekkanti Venkata Satyanarayana (Satish) | 1872 | INC | Won |
Aaluri Chinnarao | 1543 | BSP | Won |
Sikile Ratnaraju | 293 | IND | Won |
Allada Surya Bhaskara Rao | 275 | JCVIVP | Won |
Velagala Sreenivasa Reddy | 270 | JBNP | Won |
Kaki Syam Kumar | 215 | JRBHP | Won |
Ramoju Purna Chandra Sekhar | 150 | IND | Won |
ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన నియోజకవర్గాలలో ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ ఆచంట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గంలో 2019 లెక్కల ప్రకారం మొత్తం 1,74,299 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు మండలాలు ఉన్నాయి. డిలిమిటేషన్ ఆర్డర్స్లో భాగంగా 1962లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు పితాని సత్యనారాయణ. ఆ తరువాత 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి పితాని సత్యనారాయణ గెలుపొందారు. అప్పట్లో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేసినప్పటికీ వైఎస్ఆర్సీపీ నుంచి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు గెలుపొందారు.
ఆచంటలో ప్రధానంగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం మధ్య ప్రధాన పొటీ ఉంటుంది. ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం మరోసారి పితాని సత్యనారాయణకే అభ్యర్థిగా అవకాశం కల్పించింది. వైసీపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన చెరుకువాడ శ్రీరంగనాథ రాజుతోపాటు మరికొన్ని పేర్లను పరిశీలిస్తోంది.