అసోంలో ఎన్నికల ప్రసంగాన్ని మధ్యలో ఆపిన నరేంద్ర మోదీ.. జనంలోకి వెళ్లిన ప్రధాని మెడికల్ టీమ్‌.. అసలేం జరిగిందంటే..?

|

Apr 03, 2021 | 7:17 PM

బాక్సా జిల్లాలోని తమూల్‌పూర్‌కు చేరుకున్న మోదీ.. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో తన ప్రసంగం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారిగా మోదీ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపివేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అసోంలో ఎన్నికల ప్రసంగాన్ని మధ్యలో ఆపిన నరేంద్ర మోదీ.. జనంలోకి వెళ్లిన ప్రధాని మెడికల్ టీమ్‌.. అసలేం జరిగిందంటే..?
Pm Narendra Modi In Tamulpur Election Rally
Follow us on

pm narendra modi halts speech: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. బాక్సా జిల్లాలోని తమూల్‌పూర్‌కు చేరుకున్న మోదీ.. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో తన ప్రసంగం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారిగా మోదీ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపివేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. బహిరంగ సభకు హాజరైన బీజేపీ కార్యకర్త హరిచరణ్ దాస్ వడదెబ్బ(డీ హైడ్రేషన్‌)కు గురయ్యాడు. దీనిని గమనించిన ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. అతనికి నీరు అందించి వైద్యం చేయాల్సిందిగా తన మెడికల్‌ టీమ్‌కు సూచించారు. దీంతో వారు హరిచరణ్‌కు ప్రాథమిక చికిత్స అందించారు.


అసోంలోని బస్కా జిల్లా తముల్‌పూర్‌లో బహిరంగసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో జనాల్లో ఉన్న కార్యకర్త హరిచరణ్‌ దాస్‌ ఎండలకు తాళలేక వడదెబ్బకు గురయ్యారు. అతడి ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. అనంతరం ప్రధాని ప్రసంగం కొనసాగించారు. ప్రధానమంత్రి వెంట ఎప్పటికీ నలుగురితో కూడిన వైద్య బృందం వెంట ఉండే విషయం తెలిసిందే. నిరంతరం ఆ వైద్యులు ప్రధాని వెంట ఉంటారు.

ఇక, మోదీ తన ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “నా రాజకీయ అనుభవం, ప్రజలు చూపెడుతున్న ప్రేమ ఆధారంగా అసోంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని నేను చెప్పగలను” అని అన్నారు. తీవ్రవాదంలో చేరిన యువత దాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. అలా వచ్చిన వారికి పునారావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే యువత అసోం అభివృద్ది కోసం ఓటు వేయాలని కోరారు.

Also Read…  విపత్కర సమయంలో దేశ సేవకు అంకితం.. రైల్వే ఉద్యోగులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు