సరిహద్దు వద్ద ఎగురుతూ కనిపించిన పాక్ డ్రోన్.. కాల్పులతో విరుచుకుపడిన బీఎస్‌ఎఫ్ అధికారులు

జమ్మూ కాశ్మీర్‌ లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌ లోని సరిహద్దు వద్ద శనివారం రాత్రి పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్‌ను ఎగురుతూ కనిపించింది. దాంతో అప్రమత్తం అయిన బీఎస్‌ఎఫ్ అధికారులు ఆ డ్రోన్‌పై కాల్పులు జరిపారు..

  • Rajeev Rayala
  • Publish Date - 9:42 am, Sun, 29 November 20

జమ్మూకాశ్మీర్‌ లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద శనివారం పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్‌ ఎగురుతూ కనిపించింది. దాంతో అప్రమత్తం అయిన బీఎస్‌ఎఫ్ అధికారులు డ్రోన్‌పై కాల్పులు జరిపారు. ఒక్కసారిగా అధికారులు కాల్పులు జరపడంతో డ్రోన్ వెనక్కి తిరిగింది.’ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో పాక్ డ్రోన్ ఎగురుతూ కనిపించింది. బీఎస్‌ఎఫ్ అధికారులు కాల్పులు జరపడంతో డ్రోన్ పాక్‌కు వెళ్లిపోయింది. అయినా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం.’అని బీఎస్‌ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. వారంక్రితం జమ్మూకాశ్మీర్‌లోని పూచ్ జిల్లాలోని మేంధర్ సెక్టార్‌లోని లైన్ఆఫ్ కంట్రోల్ సమీపంలో డ్రోన్ కనిపించింది అధికారులు కాల్పులు జరపడంతో డ్రోన్ వెనక్కిమళ్లింది.