రాజధానిలో ర్యాపిడ్ టెస్ట్‌లు: ఐసీఎంఆర్ అనుమతి

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. అత్యధిక కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉన్నతమిళనాడును వెనక్కి నెట్టేసి ఆ స్థానాన్ని ఢిల్లీ ఆక్రమించేసింది. దీంతో రాజధానిలో ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు...

రాజధానిలో ర్యాపిడ్ టెస్ట్‌లు: ఐసీఎంఆర్ అనుమతి
Follow us

|

Updated on: Jun 27, 2020 | 3:47 PM

దేశంలో కరోనా కేసుల రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 18,552 కరోనా కేసులు నమోదు కాగా,..ఒక్క రోజు వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,08,953కి చేరగా.. దీనిలో 1,97,387 యాక్టివ్ కేసులు కాగా, 2,95,881 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు తాజాగా 384 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 15,685కు చేరింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. అత్యధిక కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉన్నతమిళనాడును వెనక్కి నెట్టేసి ఆ స్థానాన్ని ఢిల్లీ ఆక్రమించేసింది. దీంతో ఢిల్లీలో భారీ స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

దేశ రాజధానిలో వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఐసీఎంఆర్‌ సహకారంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సిరోలాజికల్‌ సర్వే చేపడుతున్నాయి. 27వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ సర్వే జరగనున్నది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ) సంస్థ కూడా ఢిల్లీ ప్రభుత్వానికి సహకరిస్తున్నది. ఢిల్లీలో యాంటిజెన్‌ ఆధారిత ర్యాపిడ్‌ టెస్ట్‌ పరీక్షలను చేపట్టనున్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. దీని కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 50వేల యాంటిజెన్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ సరఫరా చేసినట్లు ఐసీఎంఆర్‌ పేర్కొన్నది. ఉచితంగా ఈ కిట్లను ఢిల్లీ ప్రభుత్వానికి అందజేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ సిరోలాజికల్‌ పరీక్షలకు తమ వంతు సహకారం అందించింది. దీని కోసం 1.57 లక్షల ఆర్‌ఎన్‌ఏ కిట్లను అందజేసింది. వీటితో పాటు 2.84 లక్షల వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం(వీటీఎం)లను అందజేసింది. స్వాబ్‌ శ్యాంపిళ్ల సేకరణ కోసం వీటిని వినియోగిస్తారు. ఢిల్లీలో నిర్వహించే పరీక్షల కోసం డయాగ్నస్టిక్ మెటీరియల్‌ను కూడా ఐసీఎంఆర్‌ సరఫరా చేస్తున్నది. ఢిల్లీలో మొత్తం 12 ల్యాబ్‌లు ఇప్పటి వరకు 4.7 లక్షల ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేపట్టాయి. ఆ ల్యాబ్‌లకు డయాగ్నస్టిక్ మెటీరియల్‌ను తామే సరఫరా చేసినట్లు ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

దాసరి ఫ్యామిలీలో ఆస్తి వివాదమేంటి ?

రోడ్డు ప్రమాదం: చిరంజీవి చిన్ననాటి స్నేహితుడి కుటుంబం దుర్మరణం

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..