కరోనా అదుపులో మా విధానం భేష్, అరవింద్ కేజ్రీవాల్

కోవిడ్-19 ని హ్యాండిల్ చేయడంలో తమ ప్రభుత్వం అనుసరించిన మోడల్ ని ప్రపంచం గుర్తించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇందుకు..

కరోనా అదుపులో మా విధానం భేష్, అరవింద్ కేజ్రీవాల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 05, 2020 | 3:35 PM

కోవిడ్-19 ని హ్యాండిల్ చేయడంలో తమ ప్రభుత్వం అనుసరించిన మోడల్ ని ప్రపంచం గుర్తించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. కరోనా వైరస్ ని నిర్మూలించడంలో అన్ని దేశాలూ చేతులు కలపాలని ఆయన కోరారు. కోవిడ్ ని అదుపు చేయడంలో మేం పాటించిన విధానాన్ని దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంగ్ కిల్ ప్రశంసించారని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేజ్రీవాల్ అన్నారు.

కాగా-కరోనా అదుపునకు తమ దేశం 3 టీ..టెస్ట్, ట్రేస్, ట్రీట్ అనే విధానాన్ని పాటిస్తోందని, కానీ ఢిల్లీ ప్రభుత్వం టెస్ట్, హోం క్వారంటైన్ అనే మోడల్ ని అనుసరిస్తోందని షిన్ బాంగ్ పేర్కొన్నారు. ఇది మంచి ఫలితాలనిస్తోందని  అంటూ… ఇందుకు అభినందించారు.

గత 24 గంటల్లో ఢిల్లీలో  కరోనా యాక్టివ్ కేసులు సుమారు పదివేల లోపు మాత్రమే నమోదయ్యాయని, 12 మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది. హోమ్, ఐసోలేషన్, టెస్టింగులను, హాస్పిటల్స్ లో పడకలను పెంచడం ద్వారా కోవిడ్ ని చాలావరకు అదుపు చేయగలిగినట్టు వివరించింది.