రైతు సంఘాలతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చలు, అన్నదాతల కొత్త డిమాండ్ ! 500 సంఘాలను పిలవాలి !

రైతు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో ఆందోళన చేస్తున్న అన్నదాతలతో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కాకుండా ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చలు జరపనున్నారు.

రైతు సంఘాలతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చలు, అన్నదాతల కొత్త డిమాండ్ ! 500 సంఘాలను   పిలవాలి !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 01, 2020 | 12:18 PM

రైతు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుతో ఆందోళన చేస్తున్న అన్నదాతలతో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కాకుండా ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చలు జరపనున్నారు. అయితే ఈ చర్చల్లో తోమర్ కూడా పాల్గొననున్నారు. ఈ ఉదయం రాజ్ నాథ్.. హోం మంత్రి అమిత్ షా, తోమర్ తో బాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. 48 గంటల్లో పార్టీ అగ్రనేతలు సమావేశం కావడం ఇది మూడోసారి. రైతు చట్టాలపై  అన్నదాతల్లో ఏర్పడిన అపోహలను తొలగించడానికి యత్నిస్తారని, చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదని నచ్చజెబుతారని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.కానీ ఇందుకు అన్నదాతలు అంగీకరించే సూచనలే లేవని అంటున్నారు. కాగా-రైతులు మరో కొత్త డిమాండును కూడా తెరపైకి తెచ్చారు. కేంద్రం కేవలం 32 రైతు సంఘాలనే కాకుండా తమకు నేతృత్వం వహిస్తున్న మరో 500 సంఘాలను కూడా చర్చలకు ఆహ్వానించాలని వారు కోరుతున్నారు. అన్ని సంఘాలను ఆహ్వానిస్తేనే చర్చల్లో పాల్గొంటామని వారు పేర్కొన్నారు. భారతీయ కిసాన్ యూనియన్ కి చెందిన నేత ఒకరు ఈ విషయాన్ని తెలియజేస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే కాకుండా ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్న విషయాన్నీ మరువరాదన్నారు.

ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని, ఇక ఆలస్యం చేయకుండా సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని ఆయన కోరారు. అటు-ఒక రక్షణ మంత్రి రైతుల ఆందోళనపై వారితో  చర్చలు జరపడం ఇదే మొదటిసారని అంటున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు