‘అమరేంద్ర బాహుబలి అనే నేను’.. వార్నర్‌ టిక్‌టాక్‌ చూశారా..!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో టిక్‌టాక్‌లతో అదరగొట్టేస్తున్నారు ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్. ముఖ్యంగా తెలుగు, తమిళంలోని పాటలు, డైలాగ్‌లకు డ్యాన్స్‌లు, యాక్షన్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

'అమరేంద్ర బాహుబలి అనే నేను'.. వార్నర్‌ టిక్‌టాక్‌ చూశారా..!
Follow us

| Edited By:

Updated on: May 16, 2020 | 7:35 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో టిక్‌టాక్‌లతో అదరగొట్టేస్తున్నారు ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్. ముఖ్యంగా తెలుగు, తమిళంలోని పాటలు, డైలాగ్‌లకు డ్యాన్స్‌లు, యాక్షన్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఆ మధ్యన బుట్ట బొమ్మ, రాములో రాముల పాటలతో పాటు.. పోకిరి మూవీ డైలాగ్‌కి టిక్‌టాక్ చేసిన వార్నర్.. తాజాగా బాహుబలి లోని అమరేంద్ర బాహుబలి అనే నేను అన్న డైలాగ్‌కి టిక్‌టాక్ చేశారు. బాహుబలి గెటప్‌ వేసుకొని మరీ ఈ డైలాగ్‌కి తన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఇక వార్నర్ కుమార్తె మధ్యలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఈ వీడియోను 20 నిమిషాల్లోనే 1.5 లక్షల మంది వీక్షించగా.. వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ సారథ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

Read This Story Also: చెర్రీ నుంచి తీసుకున్న అప్పును తీర్చలేదు: పవన్

https://www.instagram.com/p/CAPtWPGJU8K/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

Latest Articles