Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

‘ నన్నే అభిశంసిస్తారా ? ఇది మూకలు జరిపే హత్యే ‘ ! ట్రంప్ అసహనం

తనను అభిశంసించడానికి డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘ మూకలు జరిపే హత్య ‘(లించింగ్) గా అభివర్ణించారు. ‘ మీరంతా నన్ను అభిశంసించడానికి అవసరమైన విచారణ (ఎంక్వయిరీ) కోసం కిందా, మీదా పడుతున్నారు. కానీ.. ఇది ఓ అధ్యక్షుడిపై సామూహికంగా జరిపే దాడే ‘ అని ఆయన ట్వీట్ చేశారు. ఏదో ఒకరోజు ఒక డెమొక్రాట్ సభ్యుడు అధ్యక్షుడై, మా పార్టీకి చెందిన రిపబ్లికన్లు సాధారణ మెజారిటీతో గెలిచినప్పటికీ.. వాళ్ళు ఎలాంటి ప్రాసెస్ గానీ, న్యాయబధ్ధమైన హక్కులు గానీ లేకుండానే ఆ అధ్యక్షుడిని అభిశంసించే సమయం వస్తుంది ‘ అని ఆయన ‘ శాపనార్థాలు ‘ పెట్టారు. రిపబ్లికన్లంతా ఈ రోజు ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని గమనించండి.. గుర్తు చేసుకోండి.. ఇది సామూహిక దాడి..లేదా హత్యే.. కానీ.. విజయం మాత్రం మనదే ‘ అని ట్రంప్ ట్వీటించారు. 1882.. 1968 మధ్య కాలంలో అమెరికాలో 4,700 సామూహిక హత్యా ఘటనలు జరిగాయి. బాధితులు, లేదా మృతుల్లో చాలామంది (3,400 మంది) నల్ల జాతీయులు.. వీరిలో యువతులు, యువకులు కూడా ఉన్నారు. బానిసలుగా పట్టుబడినవారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేవారు. అటు-ట్రంప్ చేసిన ట్వీట్లను సమర్థించడానికి వైట్ హౌస్ యత్నించింది. అమెరికా చరిత్రలో జరిగిన చీకటి అధ్యాయాలతో అధ్యక్షుడు తనను పోల్చుకోవడానికి ప్రయత్నించడం లేదని వైట్ హౌస్ ప్రతినిధి హొగన్ గిడ్లే అన్నారు. తాను అధ్యక్షుడైనప్పటినుంచి మీడియా తనను ఎలా ట్రీట్ చేస్తోందో మాత్రమే ఆయన చెబుతున్నారని హొగన్ పేర్కొన్నారు. మరోవైపు-రిపబ్లికన్లు సమైక్యంగా ఉండి .. అభిశంసన నుంచి తననురక్షించేందుకు ఏవిధమైన కృషీ చేయడంలేదని ట్రంప్ తన పార్టీ సభ్యులపైనే విసుక్కున్నారు.
కాగా-ఇంపీచ్ మెంట్ ఎంక్వయిరీని ట్రంప్ లించింగ్ తో పోల్చడంపట్ల అనేకమంది ఎంపీలు ఆయనను దుయ్యబట్టారు. ‘ ఈ ప్రయత్నం మూకలు జరిపే దాడి వంటిదా ? అసలు మీకేమయింది ? నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇలాంటి దాడులకు గురయ్యారో మీకు తెలుసా ? మీరు చేసిన ట్వీట్ ని డిలీట్ చేయండి ‘ అని బాబీ రష్ అనే రిపబ్లికన్ కోరారు. ఇలాంటి పదాలను వాడరాదని, వెంటనే ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మరో రిపబ్లికన్ డిమాండ్ చేశారు.