Khiladi Lady: ఈమె లేడీ కాదు…కిలాడీ.. నాలుగు పెళ్లిళ్లు.. ఎన్నో మోసాలు

ఈమె లేడీ కాదు...కిలాడీ. ఈ మాయలేడి లీలలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తీగ లాగుతుంటే డొంక కదులుతోంది.

Khiladi Lady: ఈమె లేడీ కాదు...కిలాడీ.. నాలుగు పెళ్లిళ్లు.. ఎన్నో మోసాలు
Kiladi Lady

Updated on: Jul 18, 2021 | 4:04 PM

ఈమె లేడీ కాదు…కిలాడీ. ఈ మాయలేడి లీలలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. ఒక్కొక్కటిగా ఈమె చేసిన నిర్వాకాలు బయటికొస్తున్నాయి. మాయమాటలతో మగవాళ్లను ముగ్గులోకి దింపి.. పని పూర్తవగానే వారికి హ్యాండివ్వడం ఈమె స్టైల్‌. ఇప్పటివరకు నలుగురిని పెళ్లి చేసుకుంది. ఎంతోమందికి టోకరా వేసింది. వివరాల్లోకి వెళ్తే.. కరూర్‌ జిల్లాకు చెందిన సౌమ్య.. రామనాథపురం జిల్లాకు చెందిన పోలీస్‌ సురేష్‌ను మూడో పెళ్లి చేసుకుంది. అతని పేరుతో డబ్బులు వసూలు చేసింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో దిగిన ఫొటోలు చూపించి..లక్షల రూపాయలు దోచేసింది. ఆ తర్వాత సురేష్‌కు హ్యాండిచ్చి సేలంలో శ్రీనివాసన్‌ను మ్యారేజ్‌ చేసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల బంధువునంటూ బురిడీ కొట్టిస్తోంది ఈ వగలాడి. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతకు టోకరా వేసింది. జాబ్స్‌ ఇప్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసింది. ఎన్నో ఆశలతో ఉద్యోగాల కోసం ఎదురుచూసిన బాధితులు..ఎంతకీ జాబ్స్‌ రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ మాయలేడి బాగోతాలన్నీ బయటికొచ్చాయి. పలు జిల్లాల నుంచి ఈ కిలాడిపై ఫిర్యాదులు రావడంతో..సౌమ్యను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు పలీసులు.

Also Read: వాగులో వెలసిన గంగమ్మ ! నట్టనడి ప్రవాహంలో అద్భుత దృశ్యం

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బుల్లెట్ రైడ్.. సిబ్బందికి కీలక సూచనలు

Loading...
Unable to load recommendations.
Follow Us