రంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన ఉన్మాది.. జైలుకు పంపించారని పగతో యువతిపై గొడ్డలితో దాడి

బెయిల్‌పై విడుదలైన ఉన్మాది ఆ యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి.. ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది.

రంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన ఉన్మాది.. జైలుకు పంపించారని పగతో యువతిపై గొడ్డలితో దాడి

Updated on: Feb 02, 2021 | 6:02 PM

Attack on Young Lady : రంగారెడ్డి జిల్లలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టినందుకు కక్ష్య పెంచుకున్నాడు. బెయిల్‌పై విడుదలైన ఉన్మాది ఆ యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి.. ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది. ఈ ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్రంగూడ టీచర్స్ కాలనీకి చెందిన యువతిపై రాహుల్ గౌడ్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. ఆమె ఇంటికి వెళ్లి ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో యువతిని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలిచారు.

ఇదిలావుంటే టీచర్స్ కాలనీకి చెందిన యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు రాహుల్ గౌడ్. దీంతో తనపై మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ఆ యువతి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాహుల్‌పై 354 న్యూసెన్స్ కేసు పెట్టి జైల్‌కి పంపించారు. దీంతో యువతిపై రాహుల్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైన పగ తీర్చుకోవాలనుకున్నాడు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన రాహుల్ గౌడ్.. గతాన్ని మనసులో ఉంచుకుని యువతిపై గొడ్డలితో దాడి చేశాడు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాహుల్‌ను పట్టుకోవడానికి 4 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.

Read Also… AP farmers police stations : ఏపీలో అన్నదాతలకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. త్వరలో జిల్లాకో రైతు పోలీస్‌స్టేషన్‌..!

Loading...
Unable to load recommendations.
Follow Us