Kerala’s Cleric Controversial Comments on Women: కేరళకు చెందిన ఇస్లామిక్ మత గురువు మహిళలను కించపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియోలో సోషల్ మీడియలో వైరల్ మారడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
రాత్రి 9 గంటలు దాటిన తర్వాత రోడ్లపై కనిపించే మహిళలందరూ వేశ్యలేనని, వారిని అత్యాచారం చేసినా, హత్య చేసినా తప్పు కాదని కేరళ ముస్లిం మతాధికారి స్వాలి బత్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2011లో జరిగిన ఓ అత్యాచారాన్ని సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2011లో గోవిందస్వామి అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా గాయపరిచాడు. ఐదు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో స్థానిక కోర్టు గోవింద స్వామికి ఉరిశిక్ష విధించగా.. 2016లో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది.
అయితే, ఈ ఘటనపై స్వాలి బత్రే తాజాగా స్పందించారు. ‘రాత్రిపూట ప్రయాణించే మహిళలందరూ వేశ్యలే. అత్యాచారానికి గురైన బాలిక కూడా రాత్రి పూట ప్రయాణిస్తోంది కాబట్టే గోవింద స్వామికి చిక్కింది. అందులో అతని తప్పేం ఉంది. రాత్రిపూట బయట కనిపించే మహిళలపై అత్యాచారానికి పాల్పడడం, చంపడం తప్పు కాదు’ అని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఆయన మాటలు రికార్డు చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే, కేరళ రాష్ట్రానికి చెందిన స్వాలి బత్రే అనే యువకుడు ఇస్లామిక్ మత గురువుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కేరళలోని ముస్లిం మతాధికారులలో 27 ఏళ్ల స్వాలి బత్రే ఒకరు. ఇతను చిన్ననాటి నుంచే అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన హెచ్‌డీపీ సిండ్రోమ్‌తో బాధపడుతుండడంతో 27 ఏళ్ల వయసులోనూ చిన్న పిల్లాడిలానే ఉంటారు. కాగా, ఈయన ఇప్పటికే ఇలాంటి ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో ఇరుక్కున్నారన్నారు.
Women shouldn’t venture out after 9 pm is the advise from this young Islamic preacher with hormonal imbalance, Swalih Bathery of Samastha Sunni, to Muslim women as men might confuse them as prostitutes! pic.twitter.com/RaML9wRJLP
— HKupdate (@HKupdate) July 13, 2021